ఆర్‌ఆర్‌ఆర్ వర్సెస్ కేజీఎఫ్ 2.. ఇంకా తేలని లెక్కలు

Tue Nov 29 2022 14:46:01 GMT+0530 (India Standard Time)

Update on RRR and KGF Movies Collections

కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమాలకు జనాలు వస్తారా.. ఓటీటీలకు అలవాటు పడ్డ ఇండియన్ సినీ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు వస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆర్ ఆర్ ఆర్ మరియు కేజీఎఫ్ 2 సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా స్టామినా ను నిరూపించాయి.భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు గా నిలిచిన కేజీఎఫ్ 2 మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాల యొక్క కలెక్షన్స్ విషయంలో ఏది టాప్.. ఏది తర్వాత అనే విషయమై ఊగిసలాట కొనసాగుతోంది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్లకు పైగానే రాబట్టింది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరియు ఓవరాల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కూడా కేజీఎఫ్ 2 సినిమా టాప్ లో నిలిచింది. అయితే జపాన్ లో ఇటీవల ఆర్ ఆర్ ఆర్ విడుదల అయ్యి భారీ వసూళ్లు సాధిస్తున్న విషయం తెల్సిందే. అక్కడ జక్కన్న మూవీ రాబడుతున్న వసూళ్లతో మొత్తం లెక్కలు మారిపోయాయి.

ఈ ఏడాది లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందు వరకు కూడా కేజీఎఫ్ 2 నే 2022 లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమా గా ఉంది. కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల జక్కన్న మూవీ కి ఆ రికార్డు దక్కింది.

ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా 1200 కోట్ల వసూళ్లు నమోదు చేసిందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్ 2 మాత్రం 1200 కోట్ల కు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వల్ప తేడాతోనే నెం.1 స్థానంను ఆర్ ఆర్ ఆర్ దక్కించుకుంది.

కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు కాస్త తక్కువ అవ్వడంతో రెండవ స్థానంలో నిలిచింది. డిసెంబర్ వచ్చేస్తోంది.. ఈ ఏడాది ఇంకా పెద్ద సినిమాలు వచ్చే అవకాశం లేదు.. కనుక 2022 యొక్క లెక్కలు తేలినట్లే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.