Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బావ‌మ‌రిది మాంచి స్పీడుమీదున్నాడే!

By:  Tupaki Desk   |   6 Dec 2022 12:30 PM GMT
ఎన్టీఆర్ బావ‌మ‌రిది మాంచి స్పీడుమీదున్నాడే!
X
టాలీవుడ్ లో వార‌సులకు కొద‌వ‌లేద‌న్న‌వి తెలిసింది. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ వ‌ర‌కు ఇండస్ట్రీలో వారుసుల హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌డు వారికి సంబంధించిన వారు కూడా సినిమాల్లో హీరోలుగా ఎంట్రీ ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు.

ఇప్ప‌టికే స్టార్ హీరోల బంధువుల పిల్ల‌లు కూడా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటే తాజాగా స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఫ్యామిలీ నుంచి కూడా మ‌రో హీరో రాబోతున్నాడు. ఎన్టీఆర్ వైఫ్ నార్నే ప్ర‌ణ‌తి సోద‌రుడు నార్నే నితిన్ కూడా హీరోగా తెరంగేట్రం చేయ‌బోతున్న విష‌యం తెలిందే.

నార్నే నితిన్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీకి 'శ్రీ‌శ్రీ‌శ్రీ రాజావారు' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జ‌రుగుతోంది. ఈ ఏడాది మార్చి 19న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో పాటు టైటిల్ ని కూడా మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. గ్రామీణ నేప‌త్యంలో సాగే మాస్ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు.

శ్రీ వేదాక్ష‌ర మూవీస్ బ్యాన‌ర్ పై రామారావు చింత‌లప‌ల్లి, ఎం.ఎస్‌. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ తో ఈ మూవీ 80 శాతం వ‌ర‌కు పూర్త‌యింద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మిగ‌తా భాగాన్ని కూడా పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నె నితిన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా కావ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకు స‌పోర్ట్ గా నిలిచే అవ‌కాశం వుంది.

అంతే కాకుండా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ఎన్టీఆర్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషించి జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'RRR' త‌రువాత‌ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో త‌న 30వ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్ ఆర్ట్స్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.