సందీప్ కిషన్ కోసం అంత బడ్జెటా?

Wed Sep 28 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Update on Michael Film Budget

టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల పరంపర నానాటికీ పెరిగిపోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  నుంచి యంగ్ హీరోల వరకు పాన్ ఇండియా సినిమా అంటున్నారు. తమకున్న మార్కెట్ ని మించి భారీ బడ్జెట్ లతో సినిమాలు ప్లాన్ చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు సినిమాలు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ సెట్స్ పై వున్నాయి. అందులో కొన్ని స్టార్ హీరోలతో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లు వుండగా మరి కొన్ని టైర్ టు హీరోలతో పాటు యంగ్ హీరోల ప్రాజెక్ట్ లు కూడా వుండటం తెలిసిందే.ఇదే పంథాలో సందీప్ కిషన్ కూడా 'మైఖేల్' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని భరత్ చౌదరి పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. దివ్యాంన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో గౌతమ్ మీనన్ వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు.

మేలో ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. 'గాడ్ ఓన్లీ ఫర్గీవ్స్' (దేవుడు మాత్రమే క్షమిస్తాడు' అంటూ సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీతో విడుదల చేసిన మోషన్ పోస్ట్ ఆకట్టుకుంది.

'రక్తం స్వేదం లక్ష్యం.. మైఖేల్ ఫస్ట్ లుక్ ఇదిగో అంటూ సందీప్ కిషన్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీపై తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సందీప్ కిషన్ సినిమా బడ్జెట్ 8 టు 10 క్రోర్స్ ఆపైన అంతే. అయితే పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న 'మైఖేల్' కోసం అంతకు మించి ఖర్చు చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్ రూ. 35 కోట్లు దాటిందని తెలుస్తోంది. ఇదే సందీప్ కిషన్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్. అయితే ఇది సినిమా పూర్తయ్యే నాటికి మరింతగా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

ఓవర్ బడ్జెట్ అయ్యే ప్రమాదం వుందని ఇండస్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నాయట. సందీప్ కిషన్ మార్కెట్ స్థాయిని మించి ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ఏమంత శ్రేయస్కరం కాదని ఇప్పటికైనా నిర్మాతలు జాగ్రత్త పడితే మంచిదని కొంత మంది సలహా ఇస్తున్నారట.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.