Begin typing your search above and press return to search.

కొరటాల మరో డీల్ సెట్టయినట్లే!

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:04 AM GMT
కొరటాల మరో డీల్ సెట్టయినట్లే!
X
దర్శకుడు కొరటాల శివ తన తదుపరి సినిమాను మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో మరో ప్రాజెక్టును ఈ జూలై లోనే మొదలుపెట్టాల్సింది. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత మళ్లీ వీరు కలయికలో సినిమా వస్తోంది అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

మరోసారి స్క్రిప్ట్ పై పూర్తిస్థాయిలో చర్చలు జరపడంతో ఎక్కడో కాస్త అనుమానంగ అనిపించడంతో ఎన్టీఆర్ మళ్ళీ రివర్క్ చేయమని సలహాలు ఇచ్చాడు. దీంతో కొరటాల శివ పూర్తిస్థాయిలో స్క్రిప్టును సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది.

ఇక మొత్తానికి సినిమా షూటింగ్ అయితే మరి కొన్ని రోజుల్లో మొదలుపెడతారు అని ప్రస్తుతం ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పటికే రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇక కొరటాల శివ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఎ ఏడాది NTR30 సినిమాను సమ్మర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం. ఇది ఇలా ఉంటే కొరటాల శివ దాదాపు మరొక హీరోతో సినిమా చేసేందుకు డీల్ అయితే సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరు కాదు నందమూరి బాలకృష్ణ అనే సమాచారం.

సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో బాలయ్య బాబు ఒక సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక బాలయ్యను కొరటాల శివను కలిపి సినిమా చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. నందమూరి బాలకృష్ణ కూడా ఆలోపు గోపిచంద్ మలినేని సినిమాను రిలీజ్ చేసి. అనంతరం అనిల్ రావిపూడి సినిమా ఫినిష్ చేస్తాడు.

అలాగే బాలయ్యకు మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇక ఈ లోపు కొరటాల శివ ఎన్టీఆర్ తో మంచి సినిమా చేస్తే గనక ఈ కాంబినేషన్ కు మంచి హైప్ అవకాశం ఉంటుంది. మరి ఈ కాంబో సెట్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. సితార బ్యానర్ లో రవితేజ కూడా ఒక సినిమా చేయనున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.