Begin typing your search above and press return to search.

గాడ్ ఫాదర్ మొదటి రోజు కలెక్షన్స్.. వాటి కంటే తక్కువే!

By:  Tupaki Desk   |   6 Oct 2022 5:31 AM GMT
గాడ్ ఫాదర్ మొదటి రోజు కలెక్షన్స్.. వాటి కంటే తక్కువే!
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా బుధవారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. మలయాళంలో బాక్సాఫీస్ సక్సెస్ గా నిలిచినటువంటి లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని మెగాస్టార్ చిరంజీవి గత వారం రోజుల నుండి ప్రమోషన్స్ లో అయితే చాలా గట్టిగానే చెప్పారు.

ఇక ఈ సినిమా మొదటిరోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే మెగాస్టార్ కెరీర్ లో మరోసారి మంచి ఓపెనింగ్ అందుకున్న సినిమాగా నిలిచినట్లుగా తెలుస్తోంది. ముందుగా రెండు రాష్ట్రాల ఏరియాలో కలెక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి నైజం లో ఈ సినిమా 3.29 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా సీడెడ్ లో 3.8 కోట్లు ఉత్తరాంధ్రలో 1.26 కోట్లు ఈస్ట్ లో 1.60 కోట్లు వెస్ట్ లో 59 లక్షలు గుంటూరులో 1.75 కోట్లు కృష్ణాలో 73 లక్షలు నెల్లూరులో 57 లక్షల షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా అయితే గాడ్ ఫాదర్ సినిమా 12.97 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. గ్రాస్ 21.40 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి స్టార్ హోదా తో పోలిస్తే దసరా సమయంలో గాడ్ ఫాదర్ సినిమా ఆశ్చర్యపరిచే రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది.

ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు. ఇక కర్ణాటక హిందీలో అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా గాడ్ ఫాదర్ సినిమా మొదటిరోజు 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ ఆచార్య మూవీ ఏపీ తెలంగాణలోని మొదటి రోజు 29 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.

ఇక సైరా నరసింహారెడ్డి అత్యధికంగా 38 కోట్లు అందుకోగా అంతకు ముందు వచ్చిన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 మాత్రం 23 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక వాటికంటే గాడ్ ఫాదర్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి 91 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈ సినిమా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.