Begin typing your search above and press return to search.

గాడ్ ఫాదర్ హిందీ.. ఖాన్ ఉన్నా కోటి కూడా రాలే!

By:  Tupaki Desk   |   6 Oct 2022 6:38 AM GMT
గాడ్ ఫాదర్ హిందీ.. ఖాన్ ఉన్నా కోటి కూడా రాలే!
X
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా డిజాస్టర్ తరువాత తప్పకుండా గాడ్ ఫాదర్ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలి అని అనుకున్నారు. ఇక హిందీలో ఆయనకు ఇదివరకే కొన్నిసార్లు చేదు అనుభవాలు మిగిలినప్పటికీ కూడా మరోసారి ప్రయత్నం చేయడం సాహాసమనే చెప్పాలి. మెగాస్టార్ స్టార్ హోదా వచ్చిన తర్వాత చాలా సార్లు హిందీలో కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవి అంతగా క్లిక్ ఇవ్వలేదు.

అంత పెద్ద స్థాయిలో సైరా సినిమాను గ్రాండ్ గా విడుదల చేసిన కూడా అమితాబచ్చన్ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత RRR సక్సెస్ అనంతరం రామ్ చరణ్ స్టార్ హోదా పనికొస్తుందేమో అని ఆచార్య సినిమాను హిందీలో విడుదల చేయాలని అనుకున్నారు. అందుకోసం కొన్ని ప్రణాళికలు కూడా ముందే సిద్ధం చేసుకున్నప్పటికీ మెగాస్టార్ చివరి నిమిషంలో మళ్లీ డ్రాప్ అవుట్ అయ్యారు.

ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాను హిందీలో గ్రాండ్గా విడుదల చేయాలని ముందే అనుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ రంగంలోకి దింపారు. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో ఒరిజినల్ పృథ్వీరాజ్ క్యారెక్టర్ సల్మాన్ ఖాన్ చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ కోసం ప్రత్యేకంగా యాక్షన్ లో కొన్ని మార్పులు కూడా చేశారు.

ఒక విధంగా అది పరవాలేదు అనిపించింది. కానీ హిందీలో అయితే ఈ సినిమాను ఎవరు గమనించకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. హిందీలో దాదాపు 300 కోట్ల వరకు మార్కెట్ ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ స్టార్ హోదా అసలు ప్లాట్ ఫాదర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

హిందీలో గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు నెట్టు కలెక్షన్స్ కనీసం కోటి కూడా రాలేదు అంటే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాడ్ ఫాదర్ సినిమాకు మొదటి రోజు హిందీలో కేవలం 30 లక్షలు షేర్ కూడా రాలేదని తెలుస్తోంది.

ఏదేమైనా సల్మాన్ ఖాన్ స్టార్ హోదా ఈ సినిమాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అనుకున్నారు. కానీ అందులో ఒక్క శాతం కూడా ఈ సినిమాకు హెల్ప్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఇప్పుడు ఈ దెబ్బతో సల్మాన్ ఖాన్ స్టార్ హోదా తగ్గిందా? లేదా మెగాస్టార్ కు హిందీలో అదృష్టం లేదా? అనే సందేహాలు కలుగుగున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.