దేవిశ్రీ మ్యూజిక్ ఆల్బం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Sat Oct 01 2022 11:24:06 GMT+0530 (India Standard Time)

Update on Devisri Prasad Music Album

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సందడి కొనసాగుతోంది. ఇప్పటికే హిందీలో దేవి శ్రీ ప్రసాద్ పలు సినిమాలకు సంగీతాన్ని అందించాడు. మొదటి సారి హిందీలో ఒక మ్యూజిక్ ఆల్బం కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఆ పాట కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈమధ్య కాలంలో హిందీలో మ్యూజిక్ ఆల్బం ట్రెండ్ నడుస్తోంది. స్టార్స్ కూడా మ్యూజిక్ ఆల్బం చేస్తున్నారు.. నటిస్తున్నారు. అక్కడ మ్యూజిక్ ఆల్బం లు మంచి ఆధరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో దేవి శ్రీ ప్రసాద్ తో ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ చేయించడం జరిగింది.

భారీ గా ఖర్చు చేసి దేవి శ్రీ ప్రసాద్ తో టీ సిరీస్ నిర్మించిన ఈ మ్యూజిక్ ఆల్బం యొక్క విడుదల తేదీ పై క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 4వ తారీకున ఈ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఇందులో దేవి శ్రీ ప్రసాద్ మాట వినిపించడం మాత్రమే కాకుండా ఆయన కనిపిస్తాడు. విభిన్నమైన లొకేషన్స్ లో ఈ వీడియో చిత్రీకరించారని తెలుస్తోంది.

పుష్ప లోని శ్రీవల్లి మరియు ఇతర పాటలతో బాలీవుడ్ లో ఈ మధ్య బాగా పాపులారిటీని దక్కించుకున్నాడు. అప్పట్లో రింగ రింగ అంటూ ఓ రేంజ్ లో ఊపు ఊపిన దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ పుష్ప కారణంగా ట్రెండ్ అయ్యాడు.

మళ్లీ ఈ మ్యూజిక్ ఆల్బం తో బాలీవుడ్ లో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుని స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.