విచిత్రమైన దసరా ఆఫర్... బ్రహ్మాస్త్ర @ ₹100

Mon Sep 26 2022 10:15:40 GMT+0530 (India Standard Time)

Update on Brahmastra Film Ticket Prices

ఈ మధ్య కాలంలో సినిమాలు తెరకెక్కించడం కంటే ఆ సినిమాకు ప్రేక్షకులను రప్పించేందుకు చాలా కష్టంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కూడా ఫలితం మాత్రం కొన్ని సినిమాలకు కనిపించడం లేదు. థియేటర్లకు జనాలను రప్పించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు చాలా పాట్లు పడుతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా కి కూడా నిర్మాతలు బయ్యర్లు ఆఫర్ ప్రకటించారు.బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

భారీ ఎత్తున ఈ సినిమా కోసం ఖర్చు చేసిన నేపథ్యంలో ఇంకా పెద్ద మొత్తంలో వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు అనేది బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సమయంలో పండుగ సెలవుల్లో ప్రేక్షకులు బ్రహ్మాస్త్ర చూసేందుకు వచ్చేలా బయ్యర్లు ప్లాన్ చేస్తున్నారట.

మల్టీప్లెక్స్ ల్లో బ్రహ్మాస్త్ర సినిమా ను కేవలం వంద రూపాయలకు చూసే అవకాశం ను కల్పించబోతున్నారు. ఈ పండుగ ఆఫర్ ను ఈనెల 26వ తారీకు నుండి 29వ తారీకు వరకు కొనసాగించబోతున్నట్లుగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్ ల్లో కూడా కేవలం వంద రూపాయలకే ఈ సినిమాను చూసే అవకాశం ను కల్పించడంతో కచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

ఇటీవల నేషనల్ సినిమా డే సందర్భంగా కేవలం 74 రూపాయలకే మల్టీ ఫ్లెక్స్ లో సినిమా ను చూసే అవకాశం కల్పించడంతో లక్షల మంది మల్టీప్లెక్స్ ల వద్ద క్యూ కట్టిన విషయం తెల్సిందే. ఇప్పుడు 100 రూపాయలు టికెట్ అంటే కచ్చితంగా మళ్లీ మల్టీప్లెక్స్ ల వద్ద క్యూ ఉండే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

250 నుండి 500 రూపాయలు ఉండే టికెట్ ను కేవలం 100 రూపాయలకే ఇవ్వడం వల్ల లాభం ఉండదు.. అయినా కూడా బయ్యర్లు సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని.. దీనితో సినిమా కు ఆ తర్వాత మంచి వసూళ్లు నమోదు అవుతాయని వారు భావిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ బంపర్ ఆఫర్ అయినా బ్రహ్మాస్త్ర కి బ్రేక్ ఈవెన్ సాధించి పెట్టేనా చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.