అఖండ హిందీ కలెక్షన్స్.. తేలిపోయింది!

Tue Jan 24 2023 11:09:33 GMT+0530 (India Standard Time)

Update on Akhanda Film Hindi Collections

నటసింహం బాలకృష్ణ అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన అఖండ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 21వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసును బద్దలు చేసింది. బాలకృష్ణ కెరియర్ లోనే రికార్డు కలెక్షన్లు నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను హిందీలో డబ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేశారు.అఖండ సినిమా రిలీజ్ తర్వాత ఈ మధ్య ఏ సినిమా అంతగా ఆడలేదు. దాదాపు 2 నెలల పాటు అంటే 60 రోజులు.. ఎపీ తెలంగాణలో ప్రదర్శించబడింది. రిలీజ్ కు ముందు ఈ చిత్రం 53 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ 55 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీసు జర్నీ మొదలు పెట్టింది. ఈ సినిమా ఏపీ తెలంగాణలో 63 కోట్లకు పైగా షేర్ 105 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 75 కోట్లకు పైగా షేర్ 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ అఖండ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో ఈ సినిమాను మొత్తం 500 స్క్రీన్లలో విడుదల చేశారు. ముంబైలో 72 థియేటర్లలో ఢిల్లీలో 163 హైదరాబాద్ లో 25 స్క్రీన్లు అహ్మదాబాద్ లో 49 చండీగఢ్లో 30 థియేటర్లు పూణేలో 19 కోల్ కతాలో 38 జైపూర్ లో 27 అజ్మీర్ లో 3 భోపాల్ ఒకటి సూరత్ లో 13 లక్నోలో 46 డెహ్రాడూన్ లో 7 కలిపి మొత్తం 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

కానీ బాలీవుడ్ లో డబ్ చేసిన ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. మూడ్రోజుల క్రితం సినిమాను రిలీజ్ చేయగా.. కేవలం 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను మాత్రమే వసూలు చేసింది. సినిమా ప్రమోషన్లు ఎక్కువగా లేకపోవడం వల్లే స్పందన సరిగ్గా లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మౌత్ టాక్ పెరిగితే ఈ సినిమా ముందు ముందు రోజుల్లో భారీ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.