Begin typing your search above and press return to search.

క‌న్ఫ్యూజ్ చేస్తున్నారా.. క‌న్ఫ్యూజ్ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   17 May 2022 3:30 PM GMT
క‌న్ఫ్యూజ్ చేస్తున్నారా.. క‌న్ఫ్యూజ్ అవుతున్నారా?
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన 'కేజీఎఫ్ 2' గ‌త నెల ఏప్రిల్ లో విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈమూవీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా 1185 కోట్లు వ‌సూలు చేసి త్వ‌ర‌లో 1200 కోట్ల క్ల‌బ్ లో చేర‌బోతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హిందీలోనూ ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నార్త్ లోనూ స‌రికొత్త చ‌రిత్ర‌ని తిర‌గ‌రాసింది. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్న ఈ మూవీ ఇప్ప‌డు స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాకుండా ఈ సినిమా ఎండింగ్ లో చాప్ట‌ర్ 3 కూడా వుందంటూ మేక‌ర్స్ లీడ్ ఇవ్వ‌డంతో ఆడియ‌న్స్ చాప్ట‌ర్ 3 గురించిన అప్ డేట్స్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ప్రొడ్యూస‌ర్ నుంచి వ‌చ్చిన ఓ వార్త కేజీఎఫ్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ మాట్లాడుతూ కేజీఎఫ్ 3పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'ఈ ఏడాది డిసెంబ‌ర్ లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో చేస్తున్న 'స‌లార్‌' మూవీని న‌వంబ‌ర్ వ‌ర‌కు కంప్లీట్ చేయ‌బోతున్నాం. ఆ త‌రువాత డిసెంబ‌ర్ నుంచి కేజీఎఫ్ 3 ప‌నులు మొద‌ల‌వుతాయి. 'స‌లార్‌' ఇప్ప‌టి వ‌ర‌కు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అక్టోబ‌ర్ , న‌వంబ‌ర్ వ‌ర‌కు సినిమాని పూర్తి చేసి 2023లో రిలీజ్ చేస్తాం అంటూ ప్ర‌క‌టించారు.

అలాగే 'కేజీఎఫ్ 3' ని 2023లో ప్రారంభించి 2024లో రిలీజ్ చేస్తామంటూ వెల్ల‌డించారు. ఇక ఈ మూవీ త‌రువాత ప్ర‌శాంత్ నీల్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల‌తో వ‌రుస‌గా ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

ఇదిలా వుంటే నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ వెల్ల‌డించిన విష‌యాల‌కు పూర్తి విరుద్ధంగా సినిమాటోగ్రాఫ‌ర్ భువ‌న్ గౌడ స్పందించిన తీరు అభిమానులతో పాటు ఫిల్హ్ మేక‌ర్స్ ని తీవ్ర క‌న్ఫ్యూజ‌న్ కు గురిచేస్తోంది. ప్ర‌స్తుతం మా దృష్టి అంతా 'స‌లార్‌' మీదే వుంద‌ని, కేజీఎఫ్ 3 పై వ‌స్తున్న వార్త‌ల్ని అభిమానులు ఎట్టిప‌రిస్థితుల్లోనూ న‌మ్మ‌వ‌ద్దని వెల్ల‌డించ‌డం విడ్యూరంగా వుంది. స్వ‌యంగా ప్రొడ్యూస‌ర్ వెల్ల‌డించిన మాట‌ల్ని న‌మ్మ‌వ‌ద్దంటూ సినిమాటోగ్రాఫ‌ర్ మాట్లాడిన తీరుని చాలా మంది విమ‌ర్శిస్తున్నారు.

కేజీఎఫ్ టీమ్ క‌న్ఫ్యూజ్ అవుతోందా? లేక క‌న్ఫ్యూజ్ చేస్తోందా? అని సెటైర్లు వేస్తున్నారు. స్వ‌యంగా కేజీఎఫ్ నిర్మాత చెప్పిన మాట‌ల‌నే న‌మ్మ‌వ‌ద్దంటూ భువ‌న్ గౌడ్ ప్ర‌క‌టించిన తీరుపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. స‌లార్ త‌రువాత 'కేజీఎఫ్ 3' పై నే దృష్టిపెడ‌తామ‌ని నిర్మాత చెప్పింది న‌మ్మాలా? లేక ఆయ‌న మాట‌ల‌ని ప‌ట్టించుకోవ‌ద్దంటూ భువ‌న్ గౌడ స్టేట్ మెంట్ ని ఎలా అర్థం చేసుకోవాల‌ని నెటిజ‌న్ లు, రాఖీభాయ్ ఫ్యాన్స్ టీమ్ పై మండిప‌డుతున్నారు.