రామారావు ఆన్ డ్యూటీ .. ఏంటో ఆ ప్రకటన!

Sun Dec 05 2021 12:09:13 GMT+0530 (IST)

Update From Rama Rao on duty

మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. క్రైసిస్ లోనూ రాజాలో ఉత్సాహం పెంచిన చిత్రమిది.ఆ తర్వాత వరుస చిత్రాలకు కమిటయ్యారు రవితేజ. ప్రస్తుతం `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రీకరణలో ఉంది. తాజా సమాచారం మేరకు.. రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ రేపు (డిసెంబర్ 6న) ఉదయం 10:08 గంటలకు ప్రత్యేక ప్రకటన చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం మేకర్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో కొత్త పోస్ట ర్‌ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించారు.``10.08 కి ఆర్డర్స్ ఇష్యూయింగ్`` అంటూ పోస్టర్ వేయడంతో మాస్ రాజా డ్యూటీకి ప్రమోషన్ వచ్చినట్టే కనిపిస్తోంది.

ఈ చిత్రంలో ఇద్దరు నాయికలు రాజాతో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ మూవీ మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ .. మలయాళ నటి రజిషా విజయన్ కథనాయికలుగా ఆడిపాడుతున్నారు.  కెరీర్ అరంగేట్రం నుండి విజయాలు అందుకుంటున్న రజిషా విజయన్ కోలీవుడ్ -మాలీవుడ్ లో అగ్ర నటిగా ఎదిగింది. రామారావు ఆన్ డ్యూటీ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె తొలి అడుగు వేస్తోంది. నటి కాకముందు రజిషా విజయన్ టెలివిజన్ వ్యాఖ్యాతగా అనేక టెలివిజన్ షోలను హోస్ట్ చేసింది.

ఈ చిత్రంలో నాజర్ - సీనియర్ నరేష్- పవిత్ర లోకేష్- రాహుల్ రామకృష్ణ- సురేఖా వాణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.  సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP -RT టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.