ముంబయి వీధుల్లో తలపడ్డ తెలుగు హీరోలు

Mon Nov 18 2019 16:25:28 GMT+0530 (IST)

Update About V Movie

సహజ నటుడిగా గుర్తింపు ఉన్న నాని ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే మొదటి సారి 'వి' సినిమాలో నెగటివ్ ఛాయలు ఉన్న పాత్రను నాని పోషిస్తున్నాడు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా నాని కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గద్దలకొండ గణేష్ చిత్రం సక్సెస్ తర్వాత నెగటివ్ ఛాయలు ఉన్న పాత్రలో హీరో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.వచ్చే ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుందట. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్ ముంబయిలో పూర్తి అయ్యిందట. ముంబయిలో కీలకమైన చేజింగ్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

'వి' మూవీ తాజా షెడ్యూల్ పై సుధీర్ బాబు స్పందిస్తూ.. ముంబయి షెడ్యూల్ పూర్తి చేశాం. ఉఫ్.. కాస్త కఠినమైన షెడ్యూల్ అంటూ సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. చాలా బాగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతుండగా సుధీర్ బాబు పోలీస్ గా కనిపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ మరియు అదితి రావు హైదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న నానికి ఇది 25వ చిత్రం అవ్వడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.