Begin typing your search above and press return to search.

జాన్వీ దాగుడుమూత‌లాట ఎన్నాళ్లో?

By:  Tupaki Desk   |   14 May 2022 4:30 PM GMT
జాన్వీ దాగుడుమూత‌లాట ఎన్నాళ్లో?
X
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల‌ని వుంది. తెలుగు సినిమాల్లో న‌టించాల‌న్న‌ది మా అమ్మ‌క‌ల‌. విజ‌య్ దేవ‌ర‌కొండతో క‌లిసి న‌టించాల‌ని వుంది. ఆ సామ‌యం కోసం ఎదురుచూస్తున్నా.. గ‌త కొంత కాలంగా శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ పై టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై చేసిన వ్యాఖ్య‌లు. కానీ అవి ఇంత వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. కార‌ణం జాన్వీ క‌పూర్ త‌న వ‌ద్ద‌కు వెళ్లిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌ని, ప్రొడ్యూస‌ర్ల‌ని త‌ను బిజీ అంటూ తిర‌స్క‌రించ‌డ‌మే.

మ‌రాఠీ బ్లాక్ బ‌స్ట‌ర్ 'సైర‌ఠ్‌' మూవీ ఆధారంగా క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'ధడ‌క్‌' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వా క‌పూర్ 2018లో విడుద‌లైన ఈ చిత్రం ఫ‌ర‌వాలేద‌నిపించింది. మిస్ట‌ర్ అండ్ మిస్సెస్ మ‌హి, బ‌వాల్ చిత్రాల్లో న‌టిస్తున్న జాన్వీ క‌పూర్ చేతిలో చెప్పుకోద‌గ్గ బాలీవుడ్ చిత్రాలేవీ లేవు. స్టార్ హీరోల చిత్రాలు ఒక్క‌టి కూడా లేవు. అయినా స‌రే తెలుగులో సినిమా అంటే జాన్వీ గ‌త కొన్ని నెలుల‌గా పోజు కొడుతూ సాకులు చెబుతూ వ‌స్తోంది.

ఏ స్టార్ హీరో అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో హాట్ ఫొటోషూట్ లు చేస్తూ నెట్టింట వైర‌ల్ గా మారుతోంది. అయినా స‌రే తెలుగు సినిమా అంటే ఏవేవో సాకులు చెబుతూ ఏళ్ల‌కు ఏళ్లు సాగ‌దీస్తోంది.

ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'లైగ‌ర్‌' సినిమా కోసం జాన్వీ క‌పూర్ ని హీరోయిన్ గా ఫైన‌ల్ చేయాల‌ని, ఇదే సినిమాతో త‌న‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశారు పూరి జ‌గ‌న్నాథ్. కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. జాన్వీ చివ‌రికి నో చెప్పేస‌రికి పూరి మ‌రో హీరోయిన్ ని ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది.

అన‌న్య పాండే ని 'లైగ‌ర్‌' లో హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమా పూర్త‌యింది. ఆగ‌స్టులో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ 'జ‌నగ‌ణ‌మ‌న‌' మొద‌లు పెట్టారు. జాన్వీ కోసం ఈ మూవీని మొంబైలో లాంచ్ చేశారు. త‌నే హీరోయిన్ ఈ మూవీలో అని పూరి ఫిక్స‌య్యారు. కానీ డామిట్ క‌థ మ‌ళ్లీ అడ్డం తిరిగింది. జాన్వీ మ‌ళ్లీ నో చెప్పింది. దీంతో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఫైన‌ల్ చేసుకోవాల్సి వ‌చ్చింది.

రెండు సార్లు పూరి ప్ర‌య‌త్నించినా జాన్వీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డం, చేతిలో పెద్ద స్టార్ ల సినిమాలు లేక‌పోవ‌డంతో జాన్వీకి తెలుగులో న‌టించాల‌ని లేద‌ని, కావాల‌నే తెలుగు సినిమా అంటూ దాగుడుమూత‌లు ఆడుతోంద‌ని, ఇంకా ఎన్నాళ్లీ దాగుడుమూత‌లాట అంటూ చాలా మంది సినీ ల‌వ‌ర్స్ జాన్వీపై సెటైర్లు వేస్తున్నారు.