Begin typing your search above and press return to search.

రాబోయే సినిమాలు.. శివరాత్రికి కాస్త సౌండ్ పెంచడయ్యా..

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:00 PM GMT
రాబోయే సినిమాలు.. శివరాత్రికి కాస్త సౌండ్ పెంచడయ్యా..
X
ఈ నెలలో ఫిబ్రవరి 17న రెండు సినిమాలు తెలుగులో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ 2లో తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణుకదా ఒకటి. అలాగే ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం సార్. ఈ రెండు సినిమాలకి మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గ్యాప్ లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చివరి రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.

అయితే ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కదా సినిమా గీతా ఆర్ట్స్2లో బన్నీ వాస్ తెరకెక్కించడం వలన కొంత బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా కిరణ్ అబ్బవరం స్టార్ట్ చేసేశాడు.

ఇదిలా ఉంటే ఈ కుర్ర హీరో తమిళ్ స్టార్ హీరోగా గా ధనుష్ తో పోటీ పడుతూ ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శివరాత్రి ఫెస్టివల్ కి ఈ ఇద్దరు హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి సార్ సినిమా ధనుష్ స్ట్రైట్ గా తెలుగులో చేస్తున్న మొదటి అనే సంగతి తెలిసిందే. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించింది.

నిజానికి సితార నిర్మాత అయిన నాగావంశీ ప్రమోషన్ విషయంలో చాలా అడ్వాన్స్ గా ఉంటారు. అయితే ఎందుకనో సార్ సినిమా ప్రమోషన్ ని మాతం ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. ఇంకా రిలీజ్ కి పది రోజుల సమయమే ఉన్న నేపధ్యంలో ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసి ఉండాలి.

అయితే ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. అదే మూడ్ లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో రిలీజ్ కి వారం రోజుల ముందు సార్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లుగా టాక్ ఉంది.

అయితే ధనుష్ కి కోలీవుడ్ లో ఇమేజ్ ఎక్కువ ఉన్న నేపధ్యంలో అక్కడ ప్రమోషన్ లేకున్నా ఏమీ కాదు. అయితే తెలుగు ప్రేక్షకులకి రీచ్ కావాలంటే కచ్చితంగా ప్రమోషన్ ఉండాలి. అయితే సార్ కి ప్రమోషన్ లేకపోవడం వలన ప్రేక్షకుల ఆసక్తి కిరణ్ అబ్బవరం మూవీ వినరో భాగ్యం విష్ణు కథ మీద ఉండొచ్చు అనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. మరి శివరాత్రి ఫెస్టివల్ వీకెండ్ కి కుర్ర హీరో ఎంత వరకు ఉపయోగించుకుంటాడు అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.