Begin typing your search above and press return to search.

తోట‌లో కొత్త అతిథిని ప‌రిచ‌యం చేస్తూ డాడీకి థాంక్స్ చెప్పిన ఉపాస‌న‌

By:  Tupaki Desk   |   20 Jun 2021 6:54 AM GMT
తోట‌లో కొత్త అతిథిని ప‌రిచ‌యం చేస్తూ డాడీకి థాంక్స్ చెప్పిన ఉపాస‌న‌
X
మూగ జీవాల సంర‌క్ష‌ణ కోసం పెటా.. బ్లూక్రాస్ కార్య‌క‌లాపాల గురించి తెలిసిందే. అయితే ఆర్గ‌నైజేష‌న్స్ తో సంబంధం లేకుండా మూగ జీవాల ప‌ట్ల ప్రేమ‌ను క‌న‌బ‌రిచేవారంతా నిజ‌మైన పెటా కార్య‌క‌ర్త‌లు. ఇక సెల‌బ్రిటీల్లో ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ మూగ‌జీవాల పై క‌న‌బ‌రిచే అప‌రిమిత ప్రేమ‌ను ప్ర‌త్య‌క్షంగా చాలాసార్లు చూశాం.

ఇక ఉపాస‌న- చ‌ర‌ణ్ జంట‌కు గుర్రాల పెంప‌కంపై అమితాస‌క్తి. వారి ఫామ్‌ లో గుర్ర‌పుశాల వ‌ద్ద అరుదైన దృశ్యం క‌నిపిస్తోంది. ఈ క్యూట్ గుర్రం పిల్ల (హార్స్ కాఫ్) ను చూసారు క‌దా... ఉపాస‌న చెంత‌కు వ‌చ్చి ఆప్యాయ‌త‌ను క‌న‌బ‌రుస్తోంది. కాఫ్ ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఉపాస‌న అంతే ప్రేమ‌ను క‌న‌బరిచారు. మూగ‌జీవాల హ‌క్కుల‌కు భ‌రోసా క‌ల్పించేది ప్రేమ మాత్ర‌మేన‌ని ప్రూవైంది. నిరంత‌రం జంతువుల సంబంధిత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వాటి సంర‌క్ష‌ణ గురించి మాట్లాడ‌డ‌మే కాదు.. ప్రాక్టిక‌ల్ గానూ ఉపాసన ఆచ‌రిస్తున్నారు.

ఇక‌పోతే ఈ ఫోటోని షేర్ చేసి ఉపాస‌న త‌న గుర్రాల శాల‌లో కొత్త కాఫ్ ని ప‌రిచ‌యం చేసింది. నా ల‌వ్ లీస్ అన్నిటినీ సంర‌క్షిస్తున్న నాన్న‌గారికి ధ‌న్య‌వాదాలు.. హ్యాపీ ఫాద‌ర్స్ డే అని ఉపాస‌న వ్యాఖ్య‌ను జోడించారు.
ఈ ఫోటోలో బ్యాక్ డ్రాప్ లో కొన్ని గుర్రాలు క‌నిపిస్తున్నాయి. ఫామ్ లో చేరిన ఈ క్యూట్ కాఫ్ ఎంతో ముచ్చ‌ట‌గొలుపుతోంది.