నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు హిజ్రా.. షాకిచ్చిన ఉపాసన

Sat Oct 24 2020 16:00:32 GMT+0530 (IST)

My best friend is now Hijra .. Upasana

మెగా కోడలు ఉపాసన ఓపెన్ మైండెడ్ బోల్డ్ అన్న సంగతి తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం తనకు అలవాటు. ఏదీ దాపరికం అన్నదే ఉండదు. అపోలో సంస్థానాధీశుడి వారసురాలు అయినా.. ఒక అగ్ర కథానాయకుడి భార్య అయినా కానీ.. ఆ రేంజ్ హంగామా హడావుడి కూడా తన వద్ద చూడలేం.నిరంతరం సామాజిక సేవ.. సొంత వ్యాపారాలపైనే తన ఫోకస్. ఇటీవల యువర్ లైఫ్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి ప్రత్యేకంగా లైఫ్ స్టైల్.. ఆరోగ్యం తదితర విషయాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు అపోలో సేవల గురించి వెల్లడిస్తూనే.. రకరకాల సామాజిక విషయాలపైనా ప్రజల్లో అవగాహన పెంచుతూ అప్రమత్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారీ సమయంలో ఉచితంగా అపోలో తరపున పలు సేవల్ని చేసారు. మాస్కులు పంపిణీ సహా శానిటైజర్లు పంపిణీ చేసారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన షాకింగ్ విషయం చెప్పడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఇప్పుడు హిజ్రా (ట్రాన్స్ జెండర్) అన్న విషయాన్ని ఉపాసన బహిరంగంగా చెప్పారు. తనంటే గౌరవం అని తెలిపారు. అలాగే ప్రతి ఇంట్లో మహిళల్ని గౌరవించాలని .. గౌరవించలేని వారు ఇంట్ల దేవీ మాతల ఫోటోలు పెట్టుకోకూడదని ప్రార్థనలు చేయొద్దని ఉపాసన అన్నారు. మొత్తానికి ఉపాసన చెప్పిన ఆ సంగతి ఇట్టే ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయిపోయింది.