ఉపాసన మరో ఆరోగ్యపరమైన సలహా

Thu Apr 08 2021 10:00:01 GMT+0530 (IST)

Upasana Konidela shares precautions for Coronavirus

మెగాస్టార్ కోడలు అయిన ఉపాసన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఆరోగ్య పరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాల పట్ల ఆమె కనబర్చే శ్రద్ద గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో సందేహం లేదు. హెల్త్ కు సంబంధించిన మ్యాగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరించడంతో పాటు పలు వ్యాపారాలను చూసుకుంటూ బిజీ వ్యాపారవేత్తగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు భర్త చరణ్ తో ఉంటూ భార్యగా కూడా తన విధులను నిర్వహిస్తూ ఉండే ఉపాసన తాజాగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మరో ఆరోగ్యపరమైన సలహాను జనాలకు ఇచ్చింది. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారు కూడా భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాల పాలు అవ్వాల్సి వస్తుందో చెప్పలేం. అందుకే BRCA జెన్యూ టెస్టు చేయించుకోవడం వల్ల పలు ఆరోగ్య సంబంధించి విషయాలు తెలుస్తాయని ఆమె ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.ఉపాసన ట్విట్టర్ లో.. నాకు ఇష్టమైన వారి మైండ్ ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం.. ముందే సురక్షితంగా ఉన్నామా లేదా అనే విషయాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా నేను నా స్నేహితులం కలిసి BRCA జెన్యూ టెస్టు చేయించుకున్నాం అంటూ ట్వీట్ చేసింది. BRCA జెన్యూ టెస్టు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో అన్ని ప్రముఖ ఆసుపత్రుల్లో ఈ టెస్టును అందుబాటులోకి తీసుకు వచ్చాయి.

ఆరోగ్యపరమైన విషయాల పట్ల ఉపాసనకు ఉండే శ్రద్దను చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ మెగా అభిమానులతో పాటు అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఆరోగ్యం పట్ల ఉన్న అవగాహన ఆసక్తికి హ్యాట్సాఫ్ మేడమ్ అంటూ అభినందిస్తున్నారు. ఉపాసన తాను BRCA జెన్యూ టెస్టు చేయించుకున్న ఫొటోను షేర్ చేయడంతో చాలా మందిలో అవగాహణ పెరిగనుంది. ఈ టెస్టు అన్ని విధాలుగా మంచిదంటూ వైధ్యులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.