Begin typing your search above and press return to search.

విన‌య విధేయ ఉపాస‌న‌.. చిరంజీవితో మెగా కోడ‌లు ఎలా న‌డుచుకుందో చూడండి!

By:  Tupaki Desk   |   6 March 2021 2:30 AM GMT
విన‌య విధేయ ఉపాస‌న‌.. చిరంజీవితో మెగా కోడ‌లు ఎలా న‌డుచుకుందో చూడండి!
X
అపోలో హాస్పిటల్స్ రారాణి ఉపాస‌నకు.. పుట్టింటి ఆస్తులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో కూడా తెలియ‌దు. అంత‌లా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించారు ఆమె తండ్రి. కానీ.. ఆ దర్పం కించిత్తు కూడా ఉపాస‌న‌లో క‌నిపించ‌క‌పోవ‌డం ఖ‌చ్చితంగా విశేష‌మే. కాస్త డ‌బ్బు, హోదా ఉన్న‌వారే ఎంతో లెవ‌ల్ వేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ.. ఈ మెగా కోడ‌లు విన‌య విధేయ‌త‌లు చూస్తే ఎవ్వ‌రికైనా ముచ్చ‌టేయడం ఖాయం!

ప్ర‌స్తుతం ‘ఆచార్య’ షెడ్యూల్ రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లోని మారేడుమిల్లి అడ‌వుల్లో జ‌రుగుతోంది. ఇందులో చిరుతోపాటు చెర్రీ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో వీరిద్దరి మధ్య సన్నివేశాలను షూట్ చేశాడు దర్శకుడు. అయితే.. తాజాగా ఆ సెట్స్ లో అడుగు పెట్టింది ఉపాసన. రెండు రోజుల క్రితం అక్కడకు వెళ్లిన ఉపాసన.. అక్కడ సందడి చేసింది.

అయితే.. అక్కడ రామ్ చరణ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంతో.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హైదరాబాద్ తిరిగి ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో తన మామయ్య చిరుతో కలిసి కాసేపు ముచ్చటించింది మెగా కోడలు. ఈ సందర్భంగా వారు కలిసి ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఉపాసన వినయం, విధేయత చూసిన వారంతా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఈ పిక్ లో మెగాస్టార్ కుర్చీ మీద కూర్చోగా.. ఆయన పక్కన కింద కూర్చుంది ఉపాసన. వేల కోట్లకు వారసురాలు అయినప్పటికీ.. మెట్టినింట ఎంత అణకువగా ఉందో.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మామయ్యతో ఇలా నడుచుకోవడం ఎంతో గొప్ప విషయమని అంటున్నారు. ఇప్పుడు ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది.