Begin typing your search above and press return to search.

మహేష్ సతీమణికి మెగా కోడలి స్పెషల్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   23 Jan 2021 3:45 AM GMT
మహేష్ సతీమణికి మెగా కోడలి స్పెషల్ బర్త్ డే విషెస్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ అతనికి అండగా ఉంటూ వస్తోంది. 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రత.. మహేష్ బాబు - కృష్ణ కలిసి నటించిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌ లో అడుగుపెట్టింది. ఆ సినిమా సమయంలో మహేష్ బాబుని ప్రేమించి 2005లో వివాహం చేసుకుంది. వీరికి గౌతమ్ కృష్ణ - సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేడు నమ్రత 49వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ సతీమణి నమ్రత కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా నమ్రతతో చరణ్ - ఉపాసన కలిసి దిగిన ఓ ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను మహేష్ అభిమానులతో పాటు మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదిలావుండగా నమ్రత ఈ బర్త్ డేను తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన భార్యకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపాడు. 'నేను ప్రేమించిన వ్యక్తి ఈ రోజు జన్మించారు. నీతో ఉన్న ప్రతిరోజూ ప్రత్యేకమే.. కాకపోతే ఈ రోజు మరి కాస్త ఎక్కువ. హ్యాపీ బర్త్ డే లేడీ బాస్' అని మహేష్ పోస్ట్ చేశాడు.