అన్ స్టాపబుల్ : వారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ కాదు

Mon Nov 29 2021 18:43:37 GMT+0530 (IST)

Unstoppable With NBK Episode Promo

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో రెండు వారాలకే కనిపించకుండా పోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య చేతికి ఆపరేషన్ అవ్వడం వల్ల షూటింగ్ లో పాల్గొనడానికి వీలు కుదరలేదు. దాంతో అన్ స్టాపబుల్ కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికి కూడా బాలయ్య చేతికి కట్టుతోనే ఉన్నాడు. అయినా కూడా ఇప్పటికే ఆలస్యం అయ్యిందనే ఉద్దేశ్యంతో మూడవ ఎపిసోడ్ కు సిద్దం అయ్యాడు. మూడవ ఎపిసోడ్ ను బ్రహ్మానందంతో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాని మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేశారు. బాలయ్య చేతి కట్టుతో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది ఫోన్ కాల్స్.. ఆరోగ్యం ఎలా ఉందని కాదు మూడవ ఎపిసోడ్ ఎప్పుడని.. మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. వారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ ను కాదు సెలబ్రేషన్ అంటూ బాలయ్య మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ఇంట్రో ఇచ్చాడు.ఆహా టాక్ షో లో బాలయ్య నుండి వచ్చిన ఎపిసోడ్స్ రెండు ఇప్పటికే మంచి స్పందన దక్కించుకున్నాయి. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు కనిపించగా.. రెండవ ఎపిసోడ్ లో నాని సందడి చేశాడు. మొత్తానికి రెండు ఎపిసోడ్ లో కూడా బాలయ్య తన ఎనర్జీతో కుమ్మేశాడు. ఆకట్టుకునే విధంగా ఆహా టీమ్ అన్ స్టాపబుల్ ను బాలయ్య తో సాగిస్తూ వస్తున్న సమయంలో బ్రేక్ పడింది. దాంతో ఆయన అభిమానులు మళ్లీ ఎప్పుడెప్పుడు మూడవ ఎపిసోడ్ అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎపిసోడ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

బాలకృష్ణ అఖండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. డిసెంబర్ 2 రాబోతున్న అఖండ సినిమా లో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాలయ్య ఈ సినిమా ను తెరకెక్కించినట్లుగా టీజర్ మరియు ట్రైలర్ చూస్తుంటే నమ్మకం కలుగుతుంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.