Begin typing your search above and press return to search.

‘అన్ స్టాపబుల్’ ర్యాప్.. మ్యాన్సన్ హౌస్ తో మ్యాటర్.. మారిపోతుంది మీటర్..!

By:  Tupaki Desk   |   27 Sep 2022 3:07 PM GMT
‘అన్ స్టాపబుల్’ ర్యాప్.. మ్యాన్సన్ హౌస్ తో మ్యాటర్.. మారిపోతుంది మీటర్..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా స్ట్రీమింగ్ కాబడిన ఈ కార్యక్రమం.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దీంతో ఇప్పుడు సీజన్-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆహా టీమ్ ఇటీవలే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో సీజన్-2 ను అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా అన్ స్టాపబుల్ ఆంథెమ్ ను విడుదల చేసారు. 'ఏదీ.. నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్' అనే అని బాలయ్య చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ర్యాప్ సాంగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.

‘అన్ స్టాపబుల్’ థీమ్ సాంగ్ కు మహతి స్వర సాగర్ ట్యూన్ కంపోజ్ చేశారు. రోల్ రైడా లిరిక్స్ రాయడమే కాదు.. ర్యాప్ ఆలపించారు. 'తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా.. డైలాగు వదిలితే మోగిపోద్ది బాడీ అంతా..' అంటూ బాలకృష్ణ ను హైలైట్ చేస్తూ ఈ పాట సాగింది.

సీజన్-1 కోసం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన విజువల్స్ నే ఈ ర్యాప్ సాంగ్ లో ఉపయోగించారు. అలానే మొదటి సీజన్ కు గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలను కూడా ఇందులో భాగం చేశారు. తెర వెనుక ఈ షో కోసం ఎలాంటి సన్నాహాలు జరిగాయనేది చూపించారు.

'ఎంటర్టైన్మెంట్ నువ్ తినే ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్' అంటూ బాలయ్య ‘అన్ స్టాపబుల్ విత్ NBK-2’ ద్వారా మరోసారి అలరించనున్నట్లు చెప్పకనే చెప్పారు. ముందుంది ముసళ్ళ పండుగ అంటూ తనదైన శైలిలో తొడ కొడుతూ.. ఈసారి సరికొత్త కంటెంట్ తో మరింత స్పెషల్ గా ముస్తాబు చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు.

'అన్ స్టాపబుల్' సెలబ్రిటీ టాక్ షో బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగిందని చెప్పాలి. ఇదే జనాలకు బాగా దగ్గరవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పాలి. షోకి వచ్చిన గెస్టులను తనలోని కామెడీ టైమింగ్ తో ఆట పట్టించడం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇదే ఇప్పుడు సీజన్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది.

NBK107 సినిమా షూటింగ్ ను చివరి దశకు తీసుకొచ్చిన బాలకృష్ణ.. త్వరలోనే ఆహా 'అన్ స్టాపబుల్' చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. దీని కోసం ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి అండ్ టీమ్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అయితే రెండో సీజన్ కు ఎవరెవరు గెస్టులుగా వస్తారనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. త్వరలోనే 'అన్ స్టాపబుల్ 2' షోకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.