పవర్ స్టార్ లోని సిగ్గరి గురించి మీకెంత తెలుసు?

Thu Jun 17 2021 17:00:01 GMT+0530 (IST)

Unknown Facts About Pawan Kalyan Dance

ఇంటర్ ఫెయిలై స్టార్ హీరో అయ్యాడు పవన్ కల్యాణ్. ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేసి అన్నా వదినల ఉద్భోదతో మనసు మార్చుకుని స్థిరమైన ఆలోచనలతో జీవనాన్ని సాగించాడు. పవన్ అంతటి ఎమోషనల్ పర్సనాలిటీ మనకు వేరొకరు లేరు. అసలు తాను నటుడినే కాదని అంటారు ఆయన. యావరేజ్ గానే నటన డ్యాన్సులు పర్ఫామెన్స్ తో కొట్టుకొచ్చేసానని నిజాయితీగా అంగీకరిస్తారు.కానీ పవన్ లోని కమిట్ మెంట్ ని మ్యానరిజాన్ని మంచితనాన్ని నిజాయితీని సూటిగా ఉండే తత్వాన్ని ప్రేమించని వారు లేరు. కోట్లాది మంది అభిమానులు ఆయనకు ఉన్నారంటే అతడిలోని బెస్ట్ క్వాలిటీస్ ఎమోషనల్ హానెస్టీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కారణాలు. పవనిజం అన్నది ఆల్వేస్ ట్రెండీ టాపిక్.

అప్పట్లో తనకు ఔట్ డోర్ లో పది మంది జనాల మధ్య డ్యాన్సులు చేయాలంటే చాలా సిగ్గు పడేవాడినని ఎబ్బెట్టుగా ఉండేదని కూడా పవన్ అన్నారు. సుస్వాగతం సినిమా సమయంలో రోడ్ పై డ్యాన్స్ చేయమని అడిగితే తనకు పారిపోవాలనిపించిందని పవన్ అన్నారు. అందుకు సంబంధించిన పాత వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది. అసలు తెరపై అతడిలో సిగ్గు కానీ సిగ్గరి కానీ అస్సలు కనిపించనే కనిపించరు. చిరు అంత ఫ్లెక్సిబిలిటీతోనే నటించారు.

అందుకే పవన్ కనిపిస్తే చాలు థియేటర్లలో పూలవర్షం కురుస్తుంది. అతడిని గాడ్ తో సమానంగా భావిస్తారు అభిమానులు. కరోనా క్రైసిస్ లోనూ ప్రభుత్వ కుట్రల్లోనూ రిలీజై వకీల్ సాబ్ బంపర్ కలెక్షన్లను తెచ్చిందంటే పవన్ ఛరిష్మా అలాంటిది. 100 కోట్లు పైగా బిజినెస్ చేయించే రేర్ హీరో పవన్ కల్యాణ్. ప్రస్తుతం రాజకీయాలకు కామా పెట్టి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.