శంకర్ సినిమాలో RC లుక్ ఎలా ఉండబోతోంది?

Thu Sep 16 2021 12:02:12 GMT+0530 (IST)

Universal excitement over the RC15 look

ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఓ భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలన్నది మెగాస్టార్ చిరంజీవి కల. అయితే అది ఇప్పటికీ నెరవేరలేదు. ఆయన చేసిన తొలి చిత్రం `జెంటిల్ మెన్`ని గీతా ఆర్ట్స్ హిందీలో `ది జెంటిల్ మెన్`గా రీమేక్ చేసింది. దీనికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించారు. అయితే ఈ మూవీ హిందీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి శంకర్ తో సినిమా చేయాలన్న చిరు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.అయితే ఆ కల తన తనయుడితో నెరవేరుతుండటంతో మెగాస్టార్ పట్టరాని ఆనందంతో వున్నారు. శంకర్ మెగా పవర్ స్టార్ తో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రం కావడంతో దీన్ని RC 15 అని పిలుస్తున్నారు. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు 50వ చిత్రం కావడం విశేషం.

బాలీవుడ్ హాటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన `ఒకే ఒక్కడు` తరహాలో సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో ఈ మూవీ వుండబోతోందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. శంకర్ కూడా దీనిపై హింట్ ఇచ్చేశాడు. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ ఎలా వుండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. లుక్- ఆహార్యం- మీసకట్టు కొత్తగా వుంటుందని తెలిసింది.

ఇప్పటికే ఈ మూవీ కోసం స్పెషల్ సెట్ ని నిర్మిస్తున్నారు. ఇందులో అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారట. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందే హాట్ స్టార్ కోసం ప్రత్యేకంగా ఓ యాడ్ ని షూట్ చేయబోతున్నారట. శంకర్- రామ్ చరణ్ ల కలయికలో చేస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ కి ముందే ఈ మూవీపై భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం `ఆచార్య` చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ ని చిరుతో పాటు రామ్ చరణ్ పాల్గొనగా దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు.

రెహమాన్ ని కాదని థమన్ తో..!

ఆర్సీ 15 మ్యూజిక్ పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంగీతం అందించేది ఎవరు? ఏ.ఆర్ .రెహమాన్ లేదా హారిస్ జైరాజ్ అంటూ మంతనాలు సాగాయి. కానీ దీనికి థమన్ సంగీతం అందించడం ఒక సంచలనం అని చెప్పాలి. అందుకు కారకులు దిల్ రాజు. ఆయనే తమన్ దశ దిశ తిప్పేసినది అన్న ముచ్చట సాగుతోంది. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇటీవలే సినిమా ప్రారంభోత్సవ కూడా జరిగింది. అయితే సాధారణంగా శంకర్ సినిమాలకు సంగీతం అంటే? ఏ. ఆర్ రెహమాన్..హారీష్ జయరాజ్ లాంటి దిగ్గజాలే సంగీతం అందిస్తుంటారు. ఆ ముగ్గురి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సక్సెస్ ల నేపథ్యంలోనే ఆ ద్వయానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కూడా. కానీ అనూహ్యంగా శంకర్ యంగ్ ట్యాలెంటెడ్ థమన్ రంగంలోకి దింపి షాకిచ్చారు. నిజానికి ఇది ఊహించనిది.