Begin typing your search above and press return to search.

అర్జున్‌ రెడ్డిని మించి 'యానిమల్‌'

By:  Tupaki Desk   |   24 Jan 2021 4:52 PM GMT
అర్జున్‌ రెడ్డిని మించి యానిమల్‌
X
విజయ్ దేవరకొండతో దర్శకుడు సందీప్ వంగ చేసిన అర్జున్‌ రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. అర్జున్‌ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్‌ గా సందీప్ తెరకెక్కించి సూపర్‌ హిట్ ను దక్కించుకున్నాడు. కబీర్ సింగ్ తర్వాత తెలుగులో ఆయన సినిమా ఉంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆయన బాలీవుడ్‌ సినిమా ను ప్రకటించాడు. బాలీవుడ్‌ లో భారీ బడ్జెట్‌ తో రణ్‌ బీర్‌ కపూర్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. పీరియాడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో రణ్‌ బీర్‌ కపూర్‌ తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ నటిస్తున్నాడు.

ఈ సినిమా మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ లో ఉంటుందని పీరియాడిక్‌ కథాంశంతో రూపొందబోతుంది. అర్జున్ రెడ్డికి మించిన రా కంటెంట్ ఈ సినిమాలో ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సినిమాను ఓ రేంజ్‌ లో రూపొందించేందుకు బాలీవుడ్ టెక్నీషియన్స్‌ తో సందీప్ వర్క్‌ చేయిస్తున్నాడు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ మరియు యాక్షన్‌ సీన్స్ చాలా సహజంగా ఉంటాయని అంటున్నారు. రా కంటెంట్‌ తో గతంలో సందీప్ వంగా సక్సెస్ కొట్టాడు. మరి ఈ సినిమాతో సందీప్ మరో విజయాన్ని దక్కించుకుంటాడా అనేది చూడాలి.