హీరోయిన్ సెకండ్ యాంగిల్ కు నెటిజన్స్ ఫిదా

Tue Feb 18 2020 20:00:01 GMT+0530 (IST)

Unhide Ramya Nambessan Short Film

తెలుగుతో పాటు పలు సౌత్ భాషల్లో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ రమ్యా నంబీషన్. ఈ అమ్మడు హీరోయిన్ గా ఆకట్టుకోలేక పోవడంతో చివరకు రాజకీయాల్లోకి కూడా వెళ్లింది. అక్కడ కొంత కాలం హడావుడి చేసి మళ్లీ సైలెంట్ అయ్యింది. కొంత కాలం సినిమాలకు.. రాజకీయాలకు దూరంగా విదేశాల్లో ఉండి వచ్చిన ఈ అమ్మడు మళ్లీ సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తూ జనాల్లో గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇటీవల ఈమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ‘అన్ హైడ్’ అనే షార్ట్ ఫిలింను విడుదల చేసింది. ఆసక్తికర విషయం ఏంటీ అంటే ఆ షార్ట్ ఫిల్మ్ కు డైరెక్ట్ చేసింది రమ్యానే. కేవలం మూడు నిమిషాలు ఉన్న ఆ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటీ.. వాటి పట్ల పరుషులు ఎలా ప్రవర్తించాలి ఆడవారికి పురుషులు ఎలా రక్షణగా ఉండాలి అనేది చూపించడం జరిగింది.

కేవలం మూడు నిమిషాల్లో రమ్యా చాలా మంచి కంటెంట్ ను చూపించడంతో పాటు నలుగురు ఆలోచించే విధంగా చేసిందంటూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో తెగ హడావుడి చేస్తోంది. ఈ వీడియోకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు సామాన్యులు కూడా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నటిగా ఇప్పటి వరకు రమ్యాలోని ఒక్క యాంగిల్ మాత్రమే చూసిన జనాలు ఇప్పుడు ఆమెలోని సెకండ్ యాంగిల్ అయిన డైరెక్టర్ ను చూసి ఆశ్చర్య పోతున్నారు. రమ్యా సెకండ్ యాంగిల్ కూడా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.