ప్రేమ రచయితగా రౌడీ బాయ్?

Wed Sep 18 2019 22:16:57 GMT+0530 (IST)

యూత్ లో మంచి ఫాలోయింగ్ తో పాటు బిజినెస్ సర్కిల్స్ లో గ్యారెంటీ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు  డియర్ కామ్రేడ్ ఫలితం నిరాశ కలిగించినప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో హ్యాపీగానే ఉన్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమాకు వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఫ్యాన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ రాగా సాధారణ ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. అయితే దీనికి క్రాంతి మాధవ్ దగ్గర స్పష్టమైన సమాధానం ఉందట.కథకు తగ్గట్టు యాప్ట్ గా ఉంటుందని ఈ టైటిల్ పెట్టామే తప్ప క్రేజ్ కోసం కాదని తనను కలిసిన కొందరు మీడియా మిత్రులతో అన్నట్టు వినికిడి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో విజయ్ దేవరకొండ రొమాంటిక్ రైటర్ గా కనిపిస్తాడట. ప్రపంచంలో నాలుగు విభిన్న ప్రదేశాలు దేశాలలో ఉన్న నలుగురు టిపికల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలతో ప్రేమలో పడి ఆ అనుభవాలనే నవలలుగా రాసి వాటినే సినిమాలో చెబుతాడట.

నిజంగా ప్రేమించి ఉంటాడా ఉంటాడా లేక ఊహాలలో మనల్ని విహరింపజేస్తాడా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ కు తగ్గట్టే ఇందులో మంచి ఫీల్ గుడ్ లవ్ ఎపిసోడ్స్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు ఉంటె హిట్టు ఖాయమే. గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కు దీని సక్సెస్ చాలా కీలకం