అతిత్వరలో డార్లింగ్ సినిమా టైటిల్-పోస్టర్ విడుదల!

Tue Jun 02 2020 22:30:47 GMT+0530 (IST)

Darling movie title-poster to be released soon!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ భారీ లెవెల్ లోనే రూపొందించి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి సాహో లాంటి భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల తర్వాత డార్లింగ్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. 'జిల్' ఫేమ్ రాధా కృష్ణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్..గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందని.. అంటే దాదాపు 30శాతం పూర్తయిందని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఇక ఈ సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం.. అప్డేట్స్ లేకపోవడంతో డార్లింగ్ అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. ఇకనైనా ఏదైనా అప్డేట్ అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.ఇక ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి రెండు నెలలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. కనీసం టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు 'యూవీ క్రియేషన్స్' వారి పై మండిపడుతూ '#banUVCreations' అంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్ లో యుద్ధమే ప్రకటించారు. ఇక ఫ్యాన్స్ దెబ్బకి త్వరలోనే 'ప్రభాస్ 20' సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తామని యూవీ క్రియేషన్స్ వారు తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల రెండవ వారంలో ఈ సినిమా టైటిల్ తో ఉన్న ఓ పోస్టర్ విడుదల చేయాలనీ భావిస్తున్నారట చిత్రయూనిట్. షూటింగులకు అనుమతి వచ్చిన వెంటనే.. షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం 'ఓ డియర్'.. 'రాధేశ్యామ్' టైటిల్స్ హల్చల్ అవుతున్నాయి. ఇక ఈ నెల రెండవ వారంలో టైటిల్ పోస్టర్ విడుదల చేస్తామని తెలిపే సరికి ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారట.