యూఎస్: మూడు సినిమాలతో టాలీవుడ్ బౌన్స్ బ్యాక్

Mon Aug 15 2022 13:00:02 GMT+0530 (IST)

US: Tollywood bounces back with three movies

కరోనా తర్వాత సినిమా పరిశ్రమలో ఏ స్థాయిలో మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఆడియన్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభావం కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా కాస్త తీవ్రంగానే ప్రభావం చూపించింది.అన్ని రకాలుగా సినిమా కంటెంట్ బాగుంటేనే కలెక్షన్స్ బాగొస్తున్నాయి. ఇక చాలాకాలం తర్వాత యూఎస్ లో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కొంత నిలదొక్కుకునేలా విజయాలు అందుతున్నాయి.

RRR సినిమా తర్వాత యూఎస్ఏ లో ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. ఇక మొత్తానికి ఇటీవల వచ్చిన కార్తికేయ 2 సినిమా యూఎస్ లో జెడ్ స్పీడ్ లో కలెక్షన్స్ అందుకుంటూ ఉండటం విశేషం. కార్తికేయ 2 ప్రీమియర్స్ తో కలుపుకొని మొత్తంగా వీకెండ్ లో 433k డాలర్లు అందుకుంది. మొదట సీతారామం సినిమా ఊహించని విధంగా మిలియన్ మార్కును దాటేసి ఈవారం కూడా 200K డాలర్లను అందుకునే దిశగా ముందుకు సాగుతోంది.

ఇక కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మొదటిసారి యూఎస్ మార్కెట్లో హాఫ్ మిలియన్ డాలర్లను సొంతం చేసుకోవడం విశేషం. ఇక కార్తికేయ 2 గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిందే. ఈ సినిమా అత్యధిక వేగంగా 400k డాలర్లను సొంతం చేసుకుని ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు మంచి బూస్ట్ ఇచ్చింది.

ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. నేటితో సినిమాకు మొత్తంగా 15 కోట్ల వరకు షేర్ రావచ్చు అని తెలుస్తోంది. దాదాపు బ్రేకింగ్ అయినట్లే లెక్క.

ఇక రేపటి నుంచి నిర్మాతలు ప్రాఫిట్ అందుకోవడం గ్యారెంటీ. వరుసగా తెలుగు ఇండస్ట్రీలో యూఎస్లో మార్కెట్ను కోల్పోతుంది అని అనుకునే తరుణంలో మళ్లీ ఈ మీడియం రేంజ్ సినిమాలే టాలీవుడ్ మార్కెట్ ను నిలబెట్టాయి అని చెప్పవచ్చు. ఒక విధంగా రాబోయే సినిమాలకు కూడా ఇది మంచి బూస్ట్ అనే చెప్పాలి. ఇక నితిన్ మాచర్ల నియోజకవర్గం అయితే యూఎస్ లో దారుణంగా ఫెయిల్ అయ్యింది. లాల్ సింగ్ చడ్డా రక్ష బంధన్ కూడా అక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు.