Begin typing your search above and press return to search.

RC 15 స్టార్ట్ అయ్యి రెండేళ్ళ.. ఇంకా ఎన్నో రోజులో ఈ పాట్లు

By:  Tupaki Desk   |   28 Jan 2023 3:39 PM GMT
RC 15 స్టార్ట్ అయ్యి రెండేళ్ళ.. ఇంకా ఎన్నో రోజులో ఈ పాట్లు
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తొలి సినిమా కావడం, పెద్ద డైరెక్టర్ కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు మొదలు అయ్యాయి.

అయితే ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి.. చెర్రీ సరసన నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా తీయబోతున్నట్లు చెప్పినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.

అయితే ఇప్పటికే రాజమండ్రి, విశాఖలోని గోదావరి నది ఒడ్డున సినిమా షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్, రాజమండ్రిలో ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేషాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ప్లేసుల్లో షూటింగ్ చేయడం వల్ల ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోస్ లీక్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

రామ్ చరణ్ ఈ సినిమాలో భారీ, శక్తివంతమైన రాజకీయ నేతగా చూపించబోతున్నారు. అభ్యుదయం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి సీఎంగా ఎదిగే తీరును చూపించబోతున్నారు.

రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. అంతే కాదండోయ్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా హీరో శ్రీకాంత్, సునీల్, వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్, శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు చాలానే సమస్యలు వచ్చాయి. అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అయినట్లు పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించాయి. టాలీవుడ్ లో కొన్నాళ్లు షూటింగులు నిలిపి వేయడం, శంకర్.. భారతీయుడు 2 షూటింగ్ కోసం వెళ్లడం, అలాగే ఆర్ట్ డైరెక్టర్స్ మౌనిక, రామకృష్ణ ఆ తర్వాత రవీందర్ సినిమా నుంచి వాకౌట్ చేశారు. వీటి వల్లే సినిమా ఆలస్యం అయిందని సమాచారం. మరి షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.