మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి : నమ్రత

Sun Oct 18 2020 20:30:54 GMT+0530 (IST)

Two other children recently underwent heart operations

గుండె సమస్యతో ప్రతి ఏడాది వేలాది మంది చిన్న పిల్లలు మృతి చెందుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు తనవంతు సాయంగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్ కు సహకరిస్తూ వస్తున్నారు. పది మంది ఇరవై మంది పిల్లలకు కాకుండా ఏకంగా వెయ్యి మంది పిల్లలకు పైగా మహేష్ బాబు గుండె ఆపరేషన్ చేయించారు. ఆంధ్రా హాస్పిటల్స్ మరియు లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి మహేష్ బాబు మూడున్నర సంవత్సరాల్లో వెయ్యికి పైగా చిన్నారుల గుండె ఆపరేషన్స్ చేయించాడు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరిగాయి.ఆ విషయాన్ని నమ్రత చాలా సంతోషంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్ జరిపించిన విషయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరో రెండు గుండెలు మా కుంటుంబంతో కలిశాయి. దాంతో మా కుటుంబం మరింత పెద్దది అయ్యింది. ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం బాగుందని కుదుట పడుతుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ మంచి పనిలో మాకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.