మహానటి బాలీవుడ్ ఎంట్రీ.. ఓ రేంజ్ లో ఉందిగా

Sun Mar 24 2019 22:10:38 GMT+0530 (IST)

Two Roles For Keerthy Debut

కీర్తి సురేష్ కెరీర్ గురించి మాట్లాడితే 'మహానటి' కి ముందు.. తర్వాత అని మాట్లాడాలి.  ఎందుకంటే సావిత్రి పాత్రలో కీర్తి అందరినీ అలా మెస్మరైజ్ చేసింది.  కానీ 'మహానటి' సినిమా తర్వాత కీర్తి ఆ హ్యంగోవర్ లో ఉండిపోయిందని..స్టార్ హీరోల సినిమాలలో రెగ్యులర్ పాత్రలను యాక్సెప్ట్ చేయడంలేదని అన్నారు. ఇలా ఉంటే కెరీర్ ఎక్కువ కాలం సాగే అవకాశం లేదని కూడా కామెంట్స్ వినిపించాయి.  కానీ అలా ఏమీ జరగడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కీర్తి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.'బధాయి హో' ఫేం అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరో కాగా కీర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు.  ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు  1953 నుండి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం కీర్తి సురేష్ అభిమానులకు ఒక స్వీట్ సర్ ప్రైజే. ఈ చిత్రంలో కీర్తి ద్విపాత్రాభినయం చేస్తోందట.  రెండు పాత్రలు విభిన్నంగా ఉంటాయని.. ఒక పాత్ర మధ్యవయస్కురాలిగా ఉంటుందని సమాచారం.  ఈ మిడిల్ ఏజ్డ్ పాత్రకు ప్రోస్థటిక్ మేకప్ లాంటివి లేకుండా కేవలం తన నటనతోనే ఆడియన్స్ ను మెప్పిస్తానని అంటోందట.  బాలీవుడ్ డెబ్యూ సినిమాలోనే ఇలాంటి అవకాశం లభించడం నిజంగానే సూపర్ కదా.  సౌత్ ప్రేక్షకులను ఇప్పటికే తన నటనతో క్లీన్ బౌల్డ్ చేసిన కీర్తి ఇప్పుడు నార్త్ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.

ఈ చిత్రాన్ని బోనీ కపూర్. ఆకాష్ చావ్లా.. అరుణవ జోయ్ సేన్ గుప్తా లు సంయక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన వారు సైవిన్ క్వాద్రాస్.  ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లానింగ్ చేస్తున్నారట.