బిగ్ బాస్ సర్ ప్రైజ్: బోరున ఏడ్చిన జ్యోతి - శ్రీముఖి...

Fri Sep 20 2019 10:12:13 GMT+0530 (IST)

Two Housemates to Meet Their Families; Sreemukhi, Siva Jyothi and Ravikrishna get trolled for gettin

గత రెండు సీజన్ లుగా బిగ్ బాస్ షోలో కంటెస్టంట్స్ కు సంబంధించిన ఇంటి సభ్యులని లేదా స్నేహితులని సడన్ గా హౌస్ లోకి పంపి సర్ ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే అలాగే ఈ సీజన్ 3 లో కూడా బిగ్ బాస్ ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.  అయితే ఈ సర్ ప్రైజ్ అందరికి దక్కదని చెబుతూ... గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టారు. కంటెస్టంట్స్ అందరిని లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి... కంటెస్టంట్స్ కు చెందిన పది మంది ఇంటి సభ్యులని టీవీ ద్వారా చూపించారు.ఇక వారిని చూడటమే కంటెస్టంట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా శివజ్యోతి - శ్రీముఖిలు వారి రిలేషన్ వ్యక్తులని చూసి బోరున ఏడ్చారు.  ఇలా అందరు ఎమోషనల్ గా ఉన్న సమయంలో బిగ్ బాస్ ఓ రూల్ చెప్పాడు. వచ్చిన పది మంది సభ్యుల్లో ఇద్దరు మాత్రమే ఇంటిలోకి వస్తారని ప్రకటించారు. అందుకుగాను మొదటి రౌండ్ ఉంటుందని.... ఈ రౌండ్ లో ఆ పది మంది...టేబుల్ మీద ఉన్న ఒక్కో బాక్సుని తీసుకుంటారని - అందులో ఐదు బిగ్ బాస్ ‘ఐ’ సింబల్...మిగతా ఐదు బాక్సుల్లో జోకర్ బొమ్మ ఉంటాయని చెప్పాడు.

బిగ్ బాస్ ‘ఐ’ వచ్చిన ఐదుగురు మాత్రమే రెండో రౌండ్ కి వెళ్లతారని చెప్పి...టాస్క్ ని మొదలుపెట్టారు. అందులో మొదటిగా వితికాకు సంబంధించిన ఇంటి సభ్యుడు.. బాక్స్ ఓపెన్ చేయగానే..’ఐ’ సింబల్ వచ్చింది. ఆ తర్వాత మహేశ్ కు చెందిన ఇంటి సభ్యురాలు....బాక్స్ ఓపెన్ చేయగా....అందులో జోకర్ బొమ్మ వచ్చింది. దీంతో ఆమె నెక్స్ట్ రౌండ్ కు వెళ్ళే అవకాశం కోల్పోయింది. అయితే ఈ ఇద్దరితోనే గురువారం ఎపిసోడ్ ముగిసింది. శుక్రవారం ఎపిసోడ్ లో మిగిలిన టాస్క్ కొనసాగనుంది. మరి వారిలో ఎవరు ? బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లతారో చూడాలి.