Begin typing your search above and press return to search.

రాగిణి ద్వివేది డ్రగ్ కేసులో ట్విస్ట్

By:  Tupaki Desk   |   5 Dec 2020 3:58 AM GMT
రాగిణి ద్వివేది డ్రగ్ కేసులో ట్విస్ట్
X
డ్రగ్స్ లింకులు శాండల్ వుడ్ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి పలు కీలక విషయాలను రాబట్టారు. శాండిల్ వుడ్ తారలు రాగిణి ద్వివేది.. సంజనలకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. వీరిద్దరి అగ్రహారం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి నుంచి సీసీబీ పోలీసులు కీలక సమాచారం సేకరించారు.

డ్రగ్స్ కేసులో దాదాపుగా 90 రోజులుగా రాగిణి జైలులో ఉంటున్నారు. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా జైలులో నిర్బంధించిన తనకు బెయిల్ ఇవ్వడం లేదని.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హీరోయిన్ రాగిణి ద్వివేది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ రాగిణి సుప్రీంకోర్టును కోరింది. పబ్లిసిటీ కోసమే తనను అరెస్ట్ చేశారని.. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని.. అధికారులకు డ్రగ్స్ దొరకలేదని పిటీషన్ లో పేర్కొంది.

రాగిణి దాఖలు చేసిన పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసులో రాగిణికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ హీరియిన్లు రాగిణి, సంజన, నిర్మాత శివ ప్రకాష్ లు పలుమార్లు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటీషన్లను కోర్టు బెంగళూరు కోర్టు తోసిపుచ్చింది. దాంతో రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.