Begin typing your search above and press return to search.

సినీ నటి నమితకు కవలలు

By:  Tupaki Desk   |   20 Aug 2022 5:31 AM GMT
సినీ నటి నమితకు కవలలు
X
సొంతం, జెమినీ, సింహా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ సినీ నటి నమిత కవలలకు జన్మనిచ్చారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ మేరకు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

చెన్నై సమీపంలోని క్రోమ్ పేటలో ఉన్న రేలా ఆస్పత్రిలో పండంటి ఇద్దరు మగబిడ్డలకు నమిత జన్మనిచ్చినట్లు తెలిసింది.

భర్తతో కలిసి కవలలను ఎత్తుకున్న నమిత ఆ వీడియోలో మాట్లాడింది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందని.. అభిమానుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమతో ఉంటాయని నమిత పేర్కొంది.ఇకనైనా అవి కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలను నమిత తెలిపింది. ఇద్దరు పిల్లలు, తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు పేర్కొంది.

నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నవంబర్ 2017లో నమిత వివాహం చేసుకుంది. తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులు , టీవీ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.