తెలుగు టీవీ షో లు మళ్లీ నిలిచి పోయేనా?

Mon Jul 13 2020 17:20:32 GMT+0530 (IST)

Will Telugu TV shows stop again?

కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు బుల్లి తెరపై సీరియల్స్ మరియు షో లు లేక ప్రేక్షకులు మరియు ఛానెల్స్ వారు అల్లాడి పోయారు. ఎట్టకేలకు షూటింగ్స్ కు అనుమతులు ఇవ్వడంతో గత నెల నుండి షూటింగ్స్ జరుగుతున్నాయి. గత నెల చివరి వారం నుండి కొత్త ఎపిసోడ్స్ ఇంకా కొత్త కార్యక్రమాలు షురూ అయ్యాయి. షూటింగ్స్ ప్రారంభం అయిన రెండు మూడు వారాల్లోనే తెలుగు బుల్లి తెరకు చెందిన పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు.సీరియల్ షూటింగ్స్ లో పాల్గొనే వారు మరియు షో ల షూటింగ్స్ లో పాల్గొనే వారు పలువురు కూడా కరోనా బారిన పడటంతో షూటింగ్స్ అంటేనే కొందరు భయపడుతున్నారు. ఇప్పటికే ప్రారంభం అయిన కొన్ని సినిమాలు మళ్లీ ఆగిపోయాయి. సీరియల్స్ కూడా యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ అంటూ తేలడంతో షూటింగ్స్ నిలిచి పోయాయి. చాలా సీరియల్స్ కరోనా కారణంగా మళ్లీ నిలిచి పోయే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇక తెలుగులో టాప్ యాంకర్స్ గా పేరున్న సుమ.. అనసూయ ఇంకా కొందరు పారితోషికం అదనంగా ఇస్తామన్నా కూడా షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూడం లేదు. ముఖ్యంగా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న అనసూయ షూటింగ్ అంటేనే భయపడుతోంది. పిలల్లకు ఎక్కడ తన వల్ల కరోనా అంటుకుంటుందో అనే భయంతో అనసూయ ప్రస్తుతం షూటింగ్స్ కు దూరంగా ఉంటుందట. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క జబర్దస్త్ కు మాత్రమే హాజరు అవుతుందట. ముందు ముందు కొన్ని టీవీ షోలు కూడా భయం కారణంగా నిలిచి పోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.