Begin typing your search above and press return to search.

డీఎస్పీ ని హరీష్ ని మరింత దగ్గర చేసిన తుపాకి

By:  Tupaki Desk   |   15 Oct 2019 7:36 AM GMT
డీఎస్పీ ని హరీష్ ని మరింత దగ్గర చేసిన తుపాకి
X
హారీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'వాల్మీకి' ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ అందించిన సంగీతం కూడా భలే క్లిక్ అయింది. మాస్ జోనర్ సాంగ్స్ చేయడంలో వీక్ అనే పేరున్న మిక్కీకి మొదటిసారి మాస్ పాటలు చేయగలడనే పేరు తీసుకొచ్చింది. ఆయితే ఈ సినిమాకు మొదట దేవీ శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో మిక్కీ జే మేయర్ ను తీసుకున్నారు. దేవీ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై చాలానే రూమర్లు వచ్చాయి.. హరీష్ - దేవీల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని కూడా అన్నారు.

సరిగ్గా ఈ విషయాన్నే తుపాకి ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే హరీష్ ఏం జరిగిందో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వాల్మీకి సినిమాలో ఒక రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేశామని.. అయితే దేవీ శ్రీప్రసాద్ రీమిక్స్ లు చేయరనే సంగతి తనకు తెలుసు అన్నారు. "దేవి గారు రీమిక్సులు చేయకూడదు అనేది ఒక ప్రిన్సిపుల్ గా పెట్టుకున్నారు. నేను ఆ విషయంలో దేవీని ఒప్పించవచ్చులే అని ఓవర్ కాన్ఫిడెన్స్ కు పొయాను. అయితే ఆయన మాత్రం చాలా సున్నితంగా రీమిక్స్ చేయలేనని.. మరోసారి కలిసి పని చేద్దామని ఈ సినిమాను తిరస్కరించారని చెప్పాడు. ఇద్దరం ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్.. ఆ విషయంలో నాదే పొరపాటు" అంటూ హరీష్ ఫ్రాంక్ గా చెప్పేశారు.

ఇక రీసెంట్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ "మీ చెప్పిన మంచి మాటలకు.. చక్కని వివరణకు థ్యాంక్ యూ డియరెస్ట్ సర్ జీ హరీష్ శంకర్. మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్. మీపట్ల నాకున్న ప్రేమ.. గౌరవం రెట్టింపయ్యాయి. నేను కూడా మీతో త్వరలో పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన హరీష్ "సర్ జీ.. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు ఒక గ్రేట్ కంపోజర్ మాత్రమే కాదు.. ఒక గొప్ప మనిషి.. ఆ విషయం నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.. లవ్ యూ సర్ జీ" అంటూ రిప్లై ఇచ్చారు. ఏదేమైనా తుపాకి ఇంటర్వ్యూ డీఎస్పీ - హరీష్ ఫ్రెండ్షిప్ ను మరింత బలపడేలా చేయడం విశేషం.