Begin typing your search above and press return to search.

టక్ జగదీష్ ప్రిపోన్ ప్లాన్ షాకిచ్చిందిగా

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:50 PM GMT
టక్ జగదీష్ ప్రిపోన్ ప్లాన్ షాకిచ్చిందిగా
X
నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిన‌దే. ప్రస్తుతం శ్యామ్ సింగ్ రాయ్ .. సుందరానికి తొంద‌రెక్కువ‌! అనే రెండు ఆసక్తికరమైన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప‌నిలో ప‌నిగా ట‌క్ జగదీష్ చిత్రం విడుదల కోసం ప్లాన్ చేస్తున్నాడు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ట‌క్ జ‌గ‌దీష్‌ విడుదల ప్రీపోన్ అయ్యేందుకు అవ‌కాశం ఉంద‌ని క‌థనాలొస్తున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 16 న విడుదల కావాల్సి ఉండ‌గా.. ఇప్పుడు మార్చి 11 విడుద‌ల‌కు సిద్ధమవుతోంది.

నాని గత సంవత్సరం Vతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఆశించిన ఫ‌లితం రాలేదు. కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలని బృందం యోచిస్తున్నా.. మరో మూడు సినిమాలు ఒకే తేదీకి వస్తుండ‌డంతో త‌ర్జ‌న భ‌ర్జ‌న మొద‌లైంది.

శర్వానంద్ శ్రీ‌కారం.. నవీన్ పోలిశెట్టి జాతి రత్నలు .. శ్రీ విష్ణు గాలి సంపత్ మార్చి 11 న మహా శివరాత్రి సందర్భంగా విడుదల కానున్నాయి. మూడు సినిమాల విడుదల తేదీలపై అధికారిక ధృవీకరణ ఇప్పటికే ఇచ్చారు. ఈ పండుగకు ఫుల్ అయిన‌ట్టే. థియేటర్లను సమానంగా పొందడం సాధ్యం కానందున ఏదైనా చిత్రం వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి. ట‌చ్ జ‌గ‌దీష్ కి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ట‌క్ జ‌గ‌దీష్ ముందే వ‌స్తే ఆ మేర‌కు ఇత‌రుల‌కు ఇబ్బందేన‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌.