Begin typing your search above and press return to search.

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'ట‌క్ జ‌గ‌దీష్‌'..!

By:  Tupaki Desk   |   4 Dec 2020 9:43 AM GMT
ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన ట‌క్ జ‌గ‌దీష్‌..!
X
నేచుర‌ల్ స్టార్ నాని - దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ''ట‌క్ జ‌గ‌దీష్''. నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోవిడ్ ప్ర‌భావంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ నేడు(శుక్ర‌వారం) హైద‌రాబాద్‌ లో ప్రారంభమైంది. ఫైనల్ షెడ్యూల్ లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.

కాగా, 'టక్ జగదీష్' సినిమాలో రీతూ వ‌ర్మ‌ - ఐశ్వ‌ర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఇందులో జగపతి బాబు - రావు రమేష్ - నరేష్ - నాజర్ - దేవదర్శిని - రోహిణి - మాల పార్వతి - డేనియల్ బాలాజి - తిరువీర్ - ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్.ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి హిట్ సినిమా త‌ర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో రూపొందుతోన్న 'టక్ జగదీష్' పై మంచి అంచనాలే ఉన్నాయి.