Begin typing your search above and press return to search.

రేఖ మూడు బ్రేకప్‌ లు ఇప్పటికి రహస్యమే

By:  Tupaki Desk   |   14 April 2021 11:30 PM GMT
రేఖ మూడు బ్రేకప్‌ లు ఇప్పటికి రహస్యమే
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన రేఖ ఇప్పటికి కూడా ప్రేక్షకులను అభిమానులను బుల్లి తెర లేదా వెండి తెరపై ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉంది. రేఖ అనగానే ఇప్పటికి చాలా మంది అమితాబచ్చన్‌ ను గుర్తు చేసుకోకుండా ఉండరు. ఇద్దరు సుదీర్ఘ కాలం పాటు చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరు కూడా పెళ్లి వరకు వెళ్లారు. కాని ఏం జరిగిందో ఏమో కాని అమితాబచ్చన్‌ ప్రేమించిన రేఖ ను వదిలేసి జయబాధురిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రేఖ కొన్నాళ్ల పాటు సింగిల్ గా ఉన్నారు. పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తో రేఖ ప్రేమలో పడటం జరిగింది. ఆసమయంలో రేఖ తల్లి జాతకాలు కూడా చూపించి పెళ్లికి ఓకే చెప్పారు. కుటుంబాలు పెళ్లికి ఓకే అన్న తర్వాత ఏం జరిగిందో ఏమో కాని రేఖ మరియు ఇమ్రాన్‌ ఖాన్ లు బ్రేకప్‌ అయ్యారు.

రేఖ మరియు ఇమ్రాన్‌ ల పెళ్లి విషయం జాతీయ అంతర్జాతీయ మీడియాల్లో సైతం కథనాలుగా వచ్చాయి. కాని పెళ్లి విషయానికి వచ్చేప్పటికి బ్రేకప్‌ అయ్యారు. ఇమ్రాన్‌ తో బ్రేకప్‌ తర్వాత రేఖ మరికొంత కాలం సింగిల్‌ గా జీవితాన్ని గడిపి పారిశ్రామిక వేత్త అయిన ముఖేష్‌ అగర్వాల్‌ ను రేఖ వివాహం చేసుకున్నారు. 1990 లో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన కొన్నాళ్లకే ముఖేష్‌ అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. రేఖ వంటి లేడీ సూపర్‌ స్టార్‌ ను వివాహం చేసుకున్న ముఖేష్‌ అగర్వాల్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం ఇప్పటి వరకు ఎవరికి కూడా అర్థం కాలేదు.

మొత్తంగా రేఖ మూడు ప్రేమలు కూడా బ్రేకప్‌ అవ్వడంతో ఆమె సోలో జీవితానికి అలవాటు పడ్డారు. ఆమె ఏం చేసినా కూడా ప్రేక్షకుల అటెన్షన్‌ ను మాత్రం దక్కించుకుంటారు. ఈ వయసులో కూడా ఆమె అందం మరియు డాన్సింగ్‌ స్కిల్స్‌ చూసి ఈతరం అమ్మాయిలు ఆశ్చర్యపోతారు అనడంలో సందేహం లేదు. తెలుగు లెజెండ్రీ హీరోయిన్‌ సావిత్రి భర్త జెమిని గణేషన్‌ మొదటి భార్య కూతురు రేఖ అనే విషయం తెల్సిందే. సౌత్‌ నుండి ఉత్తరాదికి వెళ్లి అక్కడ సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న రేఖ ఎంతో మందికి ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ హీరోయిన్ గా నిలిచారు. అలాంటి రేఖ జీవితంలో ఈ బ్రేకప్‌ లు ఎప్పటికి రహస్యాలుగానే మిగిలి పోతున్నాయి.