నాల్గవ సారి... సర్కారు వారి పాట ట్రోల్స్ కు ఇదే సమాధానం

Mon May 16 2022 12:52:17 GMT+0530 (IST)

Trolls on Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమా డిజాస్టర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ముఖ్యంగా విడుదల రోజు సర్కారు వారి పాటకు సంబంధించిన నెగటివ్ టాక్ ను ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేంతగా చేశారు. దాంతో సినిమా మినిమం వసూళ్లు సాధించడం కష్టమే అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ మరీ దారుణంగా సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమాకు డ్యామేజీ చేసేందుకు ప్రయత్నించారు. కాని వారు చేసిన పనితో ఫలితం దక్కించుకోలేక పోయారు అంటూ మహేష్ బాబు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారికి పోటీ అన్నట్లుగా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సర్కారు వారి పాట సినిమా కు పాజిటివ్ గా ట్వీట్స్ చేస్తూ.. ట్రెండ్ చేయడం జరిగింది.

సర్కారు వారి పాట సినిమా ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా.. టాక్ డివైడ్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో భారీగానే ఉంది. మొదటి రెండు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్ల రికార్డును దక్కించుకుందంటూ నిర్మాతలు ప్రకటించారు. ఇక ఓవర్సీస్ లో మహేష్ బాబు మరో హిట్ ను సర్కారు వారి పాట సినిమా తో దక్కించుకున్నాడు.

ఇప్పటికి కూడా చాలా మంది హీరోలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల వసూళ్లను దక్కించుకునేందుకు కిందా మీదా పడుతున్నారు. కాని మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చాలా సింపుల్ గా మొదటి రెండు రోజుల్లోనే అక్కడ మిలియన్ మార్క్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట రెండు మిలియన్ల మార్క్ ను క్రాస్ చేసింది.

మొదటి వీకెండ్ పూర్తి కాకముందే రెండు మిలియన్ ల డాలర్లను సర్కారు వారి పాట దక్కించుకుని మహేష్ బాబుకు అరుదైన రికార్డును తెచ్చి పెట్టింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో దక్కించుకోని నాలుగు సార్లు రెండు మిలియన్ల డాలర్ల వసూళ్లను మహేష్ దక్కించుకున్నాడు. దాంతో సర్కారు వారి పాట ఘన విజయం అంటూ అభిమానులు ఈ లెక్కలను చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా నెగిటివ్ ప్రచారం చేసే వారికి ఇదే సమాధానం అన్నట్లుగా వసూళ్లు నమోదు అవుతున్నాయని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలవడంతో పాటు అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమా గా కూడా నిలువబోతున్నట్లుగా అనిపిస్తుందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.