Begin typing your search above and press return to search.

రాజులు కాదు గాడిదలు కూడా రావు అషు..!

By:  Tupaki Desk   |   28 May 2022 8:34 AM GMT
రాజులు కాదు గాడిదలు కూడా రావు అషు..!
X
బిగ్ బాస్ రెండు సీజన్ ల్లో సందడి చేసిన అషు రెడ్డి సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెడుతూనే ఉంటుంది. తన సహచర నటీ నటులు మరియు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో ఇంకా స్నేహితులతో దిగిన ఫోటోలను మరియు వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అషు ఎప్పుడు కూడా మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది.

ఈమె సోషల్‌ మీడియాలో ఎంతగా పాపులారిటీని దక్కించుకుందో అంతగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. చాలా సార్లు ఈమె మరీ దారుణమైన ట్రోల్స్ ను బ్యాడ్‌ కామెంట్స్ ను కూడా ఎదుర్కొంది.

ఇటీవల నువ్వు స్నానం రోజు చేయాలంటూ కొందరు కామెంట్స్ చేసి ట్రోల్‌ చేశారు. తాజాగా అషు రెడ్డి షేర్‌ చేసిన వీడియో తో ఆమెను మరింతగా టార్గెట్‌ చేసి ట్రోల్స్ తో రెచ్చి పోయారు.

బిగ్‌ బాస్ నాన్ స్టాప్ ఫేమ్‌ అజయ్ తో కలిసి ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియోను షేర్‌ చేసింది. అందులో అషు రెడ్డి... కాలం మారిపోయింది కాని లేదంటే నా కోసం ఎంతో మంది రాజులు గుర్రాలు వేసుకుని స్వయంవరం కోసం వచ్చేవారు అంటూ డైలాగ్‌ ను ఇమిటేట్‌ చేసింది. అషు ఆ డైలాగ్ చెప్పినప్పుడు అంత సీన్ లేదు అన్నట్లుగా అజయ్‌ వెనుక నుండి ఫన్నీగా ఒకటి కొట్టాడు.

ఇక ఇన్‌ స్టా లో ఆమె ఫాలోవర్స్ మరియు ట్రోల్స్ చేసే వారు ఓ రేంజ్‌ లో ఆ వీడియో కు కామెంట్స్ చేశారు. చాలా మంది నీకు అంత సీన్‌ ఉందని భ్రమ పడిపోమాకు అంటూ ఎద్దేవా చేయగా కొందరు రాజులు ఏమో కాని కనీసం గాడిదలు కూడా నీ కోసం వచ్చేవి కావు అంటూ కామెంట్స్ చేశారు. గాడిద ల మీద నీ కోసం వచ్చే వారేమో అంటూ కొందరు కామెంట్స్ తో రెచ్చి పోయారు.

అషు కు ఇలాంటి కామెంట్స్ చాలా కామన్ విషయం అయ్యింది. ఇలాంటి కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోదు. కాని కొందరు అషు అభిమానులు మాత్రం ఆమె పై వచ్చే బ్యాడ్‌ కామెంట్స్ కు రియాక్ట్‌ అవుతూ ఉంటారు. ఒక అమ్మాయిని మరీ అంతగా అవమానించడం లో మీకు దక్కే ఆనందం ఏంటో మాకు అర్థం కావడం లేదు అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు.