బద్రి పాపను ఆడేసుకున్నారుగా!

Tue Jul 17 2018 17:18:40 GMT+0530 (IST)

Trolls Comments on Private Parts of Ameesha Patel

పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో పరిచయమై కొంత కాలం క్రేజీ హీరోల సరసన అవకాశాలు కొట్టేసిన అమీషా పటేల్ గుర్తుందిగా. అప్పుడప్పుడు వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటుంది . వయసు నలభై దాటుతున్నా ఇంకా యూత్ గానే ఫీల్ అయ్యే అమీషా ఇప్పటికీ హీరోయిన్ వేషాలు కోరుకోవడం పట్ల బాలీవుడ్ మీడియాలో తరచు జోకులు కూడా వస్తూ ఉంటాయి. ఇటీవలే దుబాయ్ షాపింగ్ లో ఉన్న అమీషా అక్కడ సరదా దిగిన ఫోటోలు తన ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో ఆశ్చర్యం ఏమి లేదు కానీ ఆ పిక్స్ లో అమీషా కొంత అసభ్యంగా అనిపించేలా స్టిల్ కనిపించడంతో నెటిజెన్లు  ట్రాల్స్ చేయటం  మొదలుపెట్టారు. ఆంటీ ఏజ్ మర్చిపోయి ఫోటోలు దిగుతోంది అంటూ కొందరు లేదు అందరి దృష్టిని ఆకర్షించేందుకు అని మరికొందరు ఇలా ఇష్టం వచ్చినట్టు పాపం కామెంట్స్ లో ఆడుకోవడం మొదలుపెట్టారు. మొదట ఇది లైట్ తీసుకున్న అమీషాకు అవి వరదలా అంతకంతకు పెరిగిపోవడం చూసి షాక్ కలిగింది.అయినా భావ ప్రకటన స్వేచ్ఛ తరహాలో ఇలా ఎవరికి నచ్చిన ఫోటోలు వివిధ భంగిమల్లో పోస్ట్ చేయటం  తప్పేమి కాదు.  కానీ అసలు  పెట్టడమే తప్పు అన్నట్టుగా ఇలా మాటలతో వేధించడం మాత్రం కరెక్ట్ కాదు. అయినా అమీషా వీటిలో  మరీ దారుణంగా లేదు. ఇంత కన్నా బోల్డ్ గా దాదాపు నగ్నంగా అనిపించే ఫొటోలతో ఎందరో మోడల్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూనే ఉన్నారు. కేవలం వయసు నలభై దాటుతోంది కాబట్టి అమీషా పద్ధతిగా మాత్రమే ఉండాలని చెప్పడం సరికాదు. అయినా ఇవి తనకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న మలైకా హీరోనా-టీవీ తార షామా సికందర్ అందరికి ఈ బెడద తప్పడం లేదు. అయినా మొత్తం చూపిస్తే తప్పనొచ్చు కానీ  ఇలా చిన్న చిన్న వాటికి కూడా నెటిజెన్లు హంగామా చేయటం ఎంత వరకు న్యాయమో వాళ్లే ఆలోచించుకోవాలి.