బిబిః మీ క్రియేటివిటీ పాడుగాను

Wed Nov 24 2021 14:13:02 GMT+0530 (IST)

Trolling On Bigg Boss

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ ఫీవర్ తో ఊగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు.. తమిళం బిగ్ బాస్ 5వ సీజన్ లతో ప్రేక్షకులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తుంటే హిందీ బిగ్ బాస్ సీజన్ 15 ఉత్తరాదిన సందడి చేస్తోంది. బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ షో అభిమానులు సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. షో లోని ప్రతి ఎలిమెంట్ గురించి చర్చించుకుంటూ విశ్లేషించుకుంటూ షో ను ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే కొన్ని సందర్బాల్లో బిగ్ బాస్ లో జరిగే పరిణామాలను విమర్శించే వారు కూడా ఉంటారు. తాజాగా ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించిన పక్రియ జరుగుతున్న నేపథ్యంలో శవ పేటికలను ఉపయోగించారు.శవ పేటికల్లో పడుకోబెట్టి ఎలిమినేషన్ కు సంబంధించిన విషయాన్ని ప్రకటించేలా టాస్క్ ను రూపొందించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో విడుదల తర్వాత నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ క్రియేటివిటీ పాడుగాను.. ఇదేం టాస్క్.. మీకు మరే క్రియేటివిటీ కనిపించలేదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీ క్రియేటివ్ టీమ్ కు ఇంతకు మించి మరే టాస్క్ కాని పద్దతి కాని కనిపించలేదా అంటూ నెటిజన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయవద్దని.. మళ్లీ ఆ టాస్క్ ను నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హిందీ సీజన్ 15 లో ఈ సంఘటన జరిగింది. మన సౌత్ బిగ్ బాస్ షో ల క్రియేటివిటీ మరీ ఇంత పీక్స్ కు చేరలేదు. కాస్త పద్దతిగానే మన టాస్క్ లు ఉంటున్నాయని నెటిజన్స్ కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో టాస్క్ లు చాలా సింపుల్ అండ్ కంటెస్టెంట్స్ మైండ్ మరియు ఫిజిక్ కు ఇబ్బంది లేకుండా ఉంటున్నాయి. ఇదే విధంగా తమిళ బిగ్ బాస్ టాస్క్ లు కూడా ఉంటున్నాయి. కాని హిందీ బిగ్ బాస్ విషయానికి వచ్చేప్పటికి ఇలాంటి తలతిక్క టాస్క్ లు ఉంటున్నాయని కొందరు అంటున్నారు. సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ కు సీజన్ సీజన్ కు భారీగా వ్యూవర్ షిప్ పెరుగుతుంది.. అలాగే ఆయన పారితోషికం కూడా వందల కోట్లు అందుకుంటున్నాడు.