Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ కు ఇది అసలు పరీక్ష

By:  Tupaki Desk   |   23 Sep 2019 1:30 AM GMT
త్రివిక్రమ్ కు ఇది అసలు పరీక్ష
X
బన్నీ తో 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్న త్రివిక్రమ్ కి ఇప్పుడీ సినిమా పెద్ద పరీక్షలా మారింది. దీనికి కారణం సంక్రాంతి రిలీజ్. గతేడాది పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి' తీసి సంక్రాంతికి విడుదల చేసిన మాటల మాంత్రికుడు ఆ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సమయంలో త్రివిక్రమ్ పై మెగా ఫ్యాన్స్ అసహనం చూపించి గట్టిగానే విరుచుకుపడ్డారు. సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనుకున్న ఆ సినిమా ట్రేడ్ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది.

ఇప్పుడా సంక్రాంతి డిజాస్టర్ ని మర్చిపోయేలా వచ్చే ఏడాది సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' తో మెగా ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. 'అజ్ఞాతవాసి'తో అందుకోలేకపోయిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ను ఈ సినిమాతో అందుకొని మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నాడు. బన్నీ కూడా సంక్రాంతి హిట్ కొట్టి చాలా ఏళ్ళయింది. 'దేశ ముదురు' తరువాత స్టయిలిష్ స్టార్ కి ఇదే సంక్రాంతి సినిమా.

సంక్రాంతికి ప్రేక్షకులను మెప్పించడానికి అన్ని త్రివిక్రమ్ అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రతీ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంటూ జాగ్రత్త వహిస్తున్నాడు. ముఖ్యంగా అజ్ఞాతవాసి నిరాశపరిచిన మెగా అభిమానులను ఆకట్టుకునేలా చూసుకుంటున్నాడు. ఇక నా పేరు సూర్య తో ఫ్లాప్ అందుకున్న బన్నీ కూడా ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. మరి ఈ ఇద్దరు కలిసి మూడో సినిమాతో సంక్రాంతి బరిలో ఎలాంటి హిట్ కొడతారో..?