డెడ్లీ కాంబో.. ఆ హీరో-డైరెక్టర్ కలిస్తే రచ్చే!

Tue May 26 2020 20:30:21 GMT+0530 (IST)

Deadly combo .. That hero-director meets!

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినీలోకానికి పరిచయం అక్కర్లేని పేరు. తన డైలాగ్స్ తో పంచులతో తనకంటూ సెపెరేట్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. తొలుత సినీ రచయితగా పరిచయమైన త్రివిక్రమ్ 2002లో 'నువ్వేనువ్వే' సినిమాతో దర్శకునిగా మారాడు. ఆయన సినిమాలకు మాటలు ఎంత ఫాస్ట్ గా రాస్తాడో.. సినిమాలు అంత లేటుగా తీస్తాడనే టాక్ ఉంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా త్రివిక్రమ్ తీసిన సినిమాలు పదకొండే. అందులోను తీసిన హీరోలతోనే ఎక్కువ సినిమాలు తీస్తుంటాడు. ఇంతవరకు త్రివిక్రమ్ తీసిన సినిమాలలో రిపీట్ అవ్వని హీరోలంటే నితిన్ తరుణ్ మాత్రమే. ఎందుకంటే 'అరవింద సమేత' తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ చేసిన సినిమాలలో రెండు మహేష్ బాబుతో పవన్ కళ్యాణ్ తో మూడు అల్లు అర్జున్ తో మూడు త్వరలో ఎన్టీఆర్ తో రెండోది పూర్తిచేయనున్నారు.త్రివిక్రమ్ ఏ హీరోతో తీసినా తిరిగి మళ్లీ మరో సినిమా చేయడానికి మొగ్గు చూపుతాడని టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇక ఈ ఏడాది బన్నీతో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు త్రివిక్రమ్. ఇక తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్-త్రివిక్రమ్ కలయికలో మూవీ సెట్టయినట్టు టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఎప్పట్నుంచో ప్రభాస్‌కి సరిపడే కథతో రెడీగా ఉన్న త్రివిక్రమ్ త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న రెండు భారీ సినిమాలు పూర్తి కావడానికి 2022 వరకూ సమయం పడుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో 2022 తరువాత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వార్తే గనక నిజం అయితే.. అటు డార్లింగ్ అభిమానులకు ఇటు త్రివిక్రమ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.