ఎట్టెట్టా.. ఇది ఇండస్ట్రీ రికార్డు అయితే బాహుబలి?

Mon Jan 20 2020 15:51:57 GMT+0530 (IST)

Trivikram fulfilled my wish to score a industry hit with my Father

నిన్న వైజాగ్ లో జరిగిన 'అల వైకుంఠపురములో' సక్సెస్ మీట్ లో బన్నీ స్పీచ్ ఆసక్తికరంగా సాగింది. అయితే ఇండస్ట్రీ రికార్డు విషయంలో బన్నీ కామెంట్లు మాత్రం విమర్శలకు దారి తీస్తున్నాయి. బన్నీ తన స్పీచ్ లో "నాన్నగారి బ్యానర్లో చాలా పెద్ద హిట్లు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. చిరంజీవి గారితో.. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.. మగధీర తో చరణ్ గారితో ఇండస్ట్రీ రికార్డు కొట్టారు. హిందీలో అమీర్ ఖాన్ గారితో కూడా ఇండస్ట్రీ రికార్డు కొట్టారు. అలా అందరితో ఇండస్ట్రీ రికార్డు కొట్టారు. మా నాన్నగారి బ్యానర్ లో నాకు సూపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు పడ్డాయి కానీ ఇండస్ట్రీ రికార్డు సినిమా లేదే అని అనుకునేవాడిని. ఎప్పటికైనా గీతా ఆర్ట్స్ లో నాది ఒక్కటయినా ఇండస్ట్రీ రికార్డు కొట్టాలని అనుకునే వాడిని. త్రివిక్రమ్ గారి వల్ల నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీ రికార్డు కొడుతున్నారు. ఇది నాకు స్వీటెస్ట్ మెమరీ." అన్నారు.అయితే అల్లు అర్జున్ ఇండస్ట్రీ రికార్డు స్పీచ్ పై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి. ఇండస్ట్రీ రికార్డుకు మీనింగ్.. ఇప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డును సృష్టించడం. ఉదాహరణ తీసుకుంటే 'పోకిరి'.. 'మగధీర'.. 'అత్తారింటికి దారేది' లాంటివి. ఈ సినిమాలన్నీ అప్పటికి ఉన్న రికార్డులను వాష్ ఔట్ చేసి మరీ కొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే ఆ తర్వాత ఆటం బాంబు లాగా 'బాహుబలి'..ఆ పైన హైడ్రోజన్ బాంబులాగా 'బాహుబలి 2' వచ్చి పడడంతో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. వీటిపేరుమీదే ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఏ సినిమా అయినా ఇండస్ట్రీ రికార్డు సాధించాలంటే 'బాహుబలి-2' రికార్డులను చెరిపేయాలి. నాన్ బాహుబలి.. నాన్ బాహుబలి-2 రికార్డులు కానే కాదు. సరిగ్గా ఈ పాయింట్ మీదే బన్నీ పై సోషల్ మీడియాలో పంచ్ లు పడి పోతున్నాయి.

'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ ఫిలిం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ప్రకారం బ్లాక్ బస్టర్ అనిపించుకోవచ్చు. ఇండస్ట్రీ రికార్డు కొట్టాలంటే మాత్రం కలెక్షన్స్ విషయంలో ఎక్సెప్షన్స్ లేకుండా నెంబర్ స్థానంలో నిలబడాలి. సంక్రాంతి పోటీ జోరుగా ఉంది కాబట్టి ఫ్లోలో బన్నీ 'ఇండస్ట్రీ రికార్డు' అంటున్నాడని దానికి అసలు అర్థం ఒకసారి అర్థం చేసుకోవాలని.. అర్థభాగం అర్థం చేసుకుంటే ఇలాంటి అనర్థాలు జరుగుతాయని అంటున్నారు.