ఇన్నాళ్లు ఈ సీన్స్ ఎక్కడ దాచావ్ గురూజీ?

Thu Oct 11 2018 14:49:58 GMT+0530 (IST)

Trivikram Style of Faction in NTR Aravinda Sametha

ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ స్టైల్ త్రివిక్రమ్ మార్క్ అద్బుతం అంటూ సినిమా చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో ఫ్యాక్షన్ సినిమాలు చేశాడు కాని త్రివిక్రమ్ కు ఇదే మొదటి ఫ్యాక్షన్ సినిమా అనే విషయం తెల్సిందే. ఫ్యాక్షనిజంను త్రివిక్రమ్ ఎలా ప్రజెంట్ చేస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫ్యాక్షనిజంను తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేశాడు. ఫ్యాక్షన్ సినిమాలు అంటే ఠక్కున తొడలు కొట్టే సీన్స్ గుర్తుకు వస్తాయి. మీసం మెలేయడం - తొడలు కొట్టడంను ఈ చిత్రంలో త్రివిక్రమ్ చూపించకుండా విభిన్నంగా ఈ చిత్రం ఉండేలా ప్లాన్ చేశాడు. అందుకోసం కొత్త ఫార్ములాను కనిపెట్టాడు. రక్తం అంటిన కత్తిని తొడపై పెట్టడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రక్తంతో ఉన్న కత్తిని తొడపై తూడ్చడం అనేది కొత్త పద్దతి అని ఫ్యాక్షనిజంను త్రివిక్రమ్ ఇలా చూపించాడు అంటూ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు.

సినిమాలో త్రివిక్రమ్ తన మార్క్ ను చూపించాడని డైలాగ్స్ తో పాటు అన్ని విధాలుగా ఎన్టీఆర్ ను వినియోగించుకున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. త్రివిక్రమ్ చేసిన ఈ మాస్ సీన్స్ చూసి ఇన్నాళ్లు ఈమాస్ సీన్స్ ను ఎక్కడ దాచావ్ గురూజీ అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మ్రోగించడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.