Begin typing your search above and press return to search.

మలయాళ హాట్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్న త్రివిక్రమ్..?

By:  Tupaki Desk   |   24 Jan 2022 11:30 PM GMT
మలయాళ హాట్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్న త్రివిక్రమ్..?
X
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా టైటిల్స్ లో 'అ' అనే అక్షరాన్ని సెంటిమెంట్ గా భావిస్తారనే టాక్ ఉంది. అలానే తనకు నచ్చిన హీరోయిన్లకు వరుస అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారని అంటుంటారు. దర్శకుడి గత సినిమాలని పరిశీలిస్తే హీరోయిన్లను రిపీట్ చేస్తుంటారనే విషయం అర్థం అవుతుంది.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'జల్సా' 'జులాయి' వంటి రెండు చిత్రాల్లో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలానే స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో 'అత్తారింటికి దారేది' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అ ఆ' వంటి మూడు సినిమాలు చేసారు. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కూడా హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాడు.

'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' వంటి రెండు చిత్రాల్లో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా చేయబోతున్న '#SSMB28' ప్రాజెక్ట్ లోనూ అమ్మడినే మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ ఎంకరేజ్ చేసే టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ స్క్రీన్ - డైలాగ్స్ అందించడమే కాకుండా అన్నీ తానై చూసుకుంటున్న 'భీమ్లా నాయక్' చిత్రంలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో మలయాళ భామ సంయుక్త మీనన్ నటిస్తుందనే సంగతి తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం తీసుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. చివరకు సంయుక్త వైపు మేకర్స్ మొగ్గుచూపారు. ఇందులో ఆమె నటన నచ్చడంతో త్రివిక్రమ్ ఇతర సినిమాకు ప్రమోట్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా మారి సితార ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ''సార్''. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను ఫైనలైజ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ చెప్పడంతోనే అమ్మడు ఈ సినిమాలో భాగమైందనే టాక్ ఉంది.

అయితే త్రివిక్రమ్ ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి ఓ యువ హీరోతో చేస్తున్న మరో ప్రాజెక్ట్ లో కూడా ఈ హాట్ బ్యూటీ సంయుక్తను హీరోయిన్ గా తీసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వరుసగా మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నాడంటే ఈ బ్యూటీ నటనకు అగ్ర దర్శకుడు ఎంత ఆకర్షితుడయ్యాడో అర్థం అవుతుందని అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందో.. ఎవరైతే కంఫ‌ర్ట్ గా ఉంటుందో అలోచించి నిర్ణ‌యం తీసుకునే స్వేచ్ఛ దర్శక నిర్మాతలకు ఉంటుంది. సినిమా విజయానికి నటీనటులు దర్శకుడి మధ్య కంఫ‌ర్ట్ జోన్ కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో సంయుక్త పర్ఫార్మన్స్ నచ్చడంతో త్రివిక్రమ్ మరో అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యుండొచ్చు. వీటిలో ఒక్క సినిమా అయినా రిలీజ్ అయితే ఈ మలయాళ బ్యూటీ నటన ఎలా ఉంటుందనేది.. ఎందుకు రిపీట్ చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది.