Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ మళ్ళీ అదేనా?

By:  Tupaki Desk   |   11 Dec 2019 1:30 AM GMT
త్రివిక్రమ్ మళ్ళీ అదేనా?
X
త్రివిక్రమ్ తీసిన లేటెస్ట్ సినిమాల్లో ఆఫీస్ బ్యాక్ డ్రాప్ తప్పనిసరి అనిపిస్తుంది. ఒక సినిమాలో ఆఫీస్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటె మరో సినిమాలో ఒక్కటైనా ఆఫీస్ సీన్ ఉంటుంది. 'అత్తారింటికి దారేది' - 'అజ్ఞాతవాసి' సినిమాల్లో ఆఫీస్ లో హీరో అతని ఫ్యామిలీ మధ్య ఎక్కువగా సన్నివేశాలు ఉంటాయి.

అయితే తాజాగా త్రివిక్రమ్ చేస్తున్న 'అల వైకుంఠపురములో' లో కూడా ఇలాంటి ఆఫీస్ సన్నివేశాలే ఎక్కువగా ఉండబోతున్నాయి. అవును సినిమా కథ సగం వరకూ ఆఫీస్ లోనే ఉంటుంది. అయితే అది ఎవరి ఆఫీస్..? అందులోకి హీరో ఎలా వెళ్ళాడు..? అనేది మాత్రం ఏదో ఆసక్తిగా రాసుకుని ఉంటాడు. లేటెస్ట్ గా వదిలిన టీజర్ గ్లిమ్ప్స్ లో కూడా ఆఫీస్ లోకి బన్నీ ఎంట్రీ బోర్డ్ మెంబర్స్ షాక్ అవ్వడం లాంటి షాట్స్ కనిపించాయి.

రేపు టీజర్ కూడా ఆల్ మోస్ట్ ఆఫీస్ లో ఉండే సన్నివేశాలతోనే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా మలయాళ సినిమా 'మై బాస్' థీంతో పాటు ఇంటిగుట్టు అనే క్లాసిక్ సినిమా థీం మిక్స్ చేసి త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మరి ఈ విషయంపై మాటల మాంత్రికుడు క్లారిటీ ఇచ్చేదెప్పుడో?