Begin typing your search above and press return to search.

సమంత చిలిపితనం అంటే ఆ 'డైరెక్టర్'కి చాలా ఇష్టమట!

By:  Tupaki Desk   |   25 May 2020 12:45 PM GMT
సమంత చిలిపితనం అంటే ఆ డైరెక్టర్కి చాలా ఇష్టమట!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్‌ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైయిన తర్వాత గ్యాప్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రస్తుతం ప్రకటించారు. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల పై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌ టైనర్‌ గా ఈ చిత్రం రానుందని టాక్. సమ్మర్ 2021లో సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మరోసారి త్రివిక్రమ్‌ కు బాగా కలిసొచ్చిన పూజాహెగ్డేనే హీరోయిన్‌ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. ప్రస్తుతం పూజా హిందీ - తెలుగు సినిమాల్లో బిజీగా ఉందట. మధ్యలో రష్మిక పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఆ స్థానంలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. సడన్‌ గా సమంత పేరు తెరపైకి వచ్చేసరికి త్రివిక్రమ్ మళ్లీ సమంత వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాడని అభిమానులలో సందేహాలు మొదలయ్యాయి.

సమంత - త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' - 'సన్ అఫ్ సత్యమూర్తి' - 'అఆ' సినిమాలలో నటించింది. మాములుగా త్రివిక్రమ్ ఒకసారి కలిసి పనిచేస్తే మళ్లీ మళ్లీ వారితోనే చేయడానికి ఇష్టపడతారు. అయితే గతంలో ఇలియానాతో రెండు సినిమాలు - పూజాహెగ్డేతో రెండు చేసాడు. మళ్లీ ఎందుకు సమంత అంటే.. సమంత నటన అంటే త్రివిక్రమ్ కి బాగా ఇష్టమట. ఆమె చిలిపితనం ఆయన రాసే మాటలకు బాగా సెట్ అవుతుందని ఆమెను ఎంచుకుంటారట. మళ్లీ పర్ఫెక్ట్ గా తెలుగు అర్థం చేసుకోగలదు. అందుకే అని సినీ వర్గాలలో టాక్. చూడాలి మరి మళ్లీ వీరిద్దరూ కలిసి పని చేస్తారేమో.. ఈ వార్త పై ఎటువంటి అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు.